వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్ రేప్: హైదరాబాదీలపై ఫిర్యాదు, రెడ్డి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Bangalore rape: School secretary arrested for cheating
బెంగళూర్: నార్త్ బెంగళూర్ స్కూల్‌ను నడిపే ట్రస్టు ప్రధాన కార్యదర్శి కెఆర్‌కె రెడ్డిని పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. మంగళవారంనాడు మూడేళ్ల బాలికపై ఈ పాఠశాలలో అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూర్‌లో అతన్ని అరెస్టు చేశారు. సిబిఎస్ఇ పాఠశాలను ఆ ట్రస్టు అక్రమంగా నడుపుతున్నట్లు విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ పాఠశాలతో పాటు మరో మూడింటిని నడుపుతున్న గౌతం అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి రెడ్డిపై విద్యాశాఖ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ హెచ్‌బి మంజునాథ్ ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రెడ్డిని అరెస్టు చేశారు.

నిబంధనలను ఉల్లంఘించి సిబిఎస్ఇ ఇంగ్లీష్ మీడియా స్కూల్‌ను ఆ సంస్థ నడుపుతోందని, తద్వారా ప్రజలను, తల్లిదండ్రులను, ప్రత్యేకంగా 900 మందికి పైగా పిల్లలను మోసం చేసిందని, దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ అనుమతి లేదని అధికార వర్గాలు చెప్పాయి.

సంబంధిత శాఖ అధికారులు పాఠశాలను తనిఖీ చేశారని, సొసైటీకి కన్నడ మాధ్యమంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నడపుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం నిరుడు మార్చి 25వ తేదీన అనుమతి ఇచ్చిందని, ఆ విషయం అప్పటి తనిఖీలో తేలిందని ఆ వర్గాలు చెప్పాయి. అయితే, పాఠశాల సిబిఎస్ఇ సిలబస్ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రీ నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు నడుపుతోందని ఆ వర్గాలు ఆరోపించాయి.

విద్యాశాఖ నలుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. వారంతా హైదరాబాదుకు చెందినవారే. ట్రస్టు అధ్యక్షురాలు కె. దుర్గ, ఉపాధ్యక్షురాలు వై. శిల్ప, ప్రధాన కార్యదర్శి కెఆర్‌కె రెడ్డి, సంయుక్త కార్యదర్శి సురేంద్రబాబులపై ఫిర్యాదు చేశారు. రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా ముగ్గురికి సమన్లు జారీ చేశారు.

English summary
Police on Friday arrested KRK Reddy, general secretary of the trust which runs the North Bangalore school where a three-year-old girl was allegedly raped on Tuesday. He was held in Bangalore following a complaint by the state education department that the trust was illegally running a CBSE school and is now in police custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X