• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ దౌత్యానికి గండి కొట్టిన అమిత్‌షా-బంగ్లాదేశ్‌పై వ్యాఖ్యలతో- ఘాటు కౌంటర్‌

|

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. ఉపఖండంలో భారత్‌కు విశ్వసనీయ మిత్ర దేశాల్లో బంగ్లా మొదటి స్ధానంలో ఉంటుంది. అలాంటి బంగ్లాదేశ్‌ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు చిచ్చు రేపాయి. భారత్‌ కంటే మెరుగైన ఆర్దిక వ్యవస్ధ కలిగిన బంగ్లాదేశ్‌ గురించి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఆ దేశం ఘాటుగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించింది.

బంగ్లాదేశ్‌తో భారత్‌ చిరకాల అనుబంధం

బంగ్లాదేశ్‌తో భారత్‌ చిరకాల అనుబంధం

1971లో పాకిస్తాన్‌పై యుద్దం చేసి మరీ బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం ఇచ్చిన చరిత్ర భారత్‌ది అయితే... ఆ తర్వాత కొన్ని వందల విషయాల్లో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా భారత్‌కు అండగా నిలిచిన చరిత్ర బంగ్లాదేశ్‌ది. ఒకప్పటి అవిభాజ్య బెంగాల్‌లో భాగమైన బంగ్లాదేశ్‌ను భారత్‌ ఇప్పటికీ ఉపఖండంలో నమ్మకమైన మిత్రదేశంగా భావిస్తోంది. తాజాగా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం బంగ్లాదేశ్‌ వెళ్లి మరీ వారి 50వ స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని వచ్చారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన భారత్‌-బంగ్లాదేశ్ సంబంధాలు ఇరుదేశాల ప్రజల మైత్రికీ నిదర్శనంగా నిలుస్తున్నాయి.

బెంగాల్‌ ప్రచారంలో అమిత్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగాల్‌ ప్రచారంలో అమిత్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు

ఉపఖండంలో భారత్‌కు నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్‌పై, ఆ దేశ ప్రజలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో పేదలు అక్కడ ఆహారం దొరక్క భారత్‌కు వలస వస్తుంటారంటూ కించ పరిచేలా మాట్లాడారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ వలసల్ని అడ్డుకుంటామన్నారు. తద్వారా బంగ్లాదేశ్‌ భారత్‌ కంటే పేద దేశం, అక్కడి ప్రజలు తిండి దొరక్క భారత్‌కు వస్తున్నారు. వారిని అడ్డుకుంటామంటూ చెప్పినట్లయింది. బెంగాల్లో బీజేపీ గెలుపు కోసం షా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

 అమిత్‌షాకు బంగ్లాదేశ్ ఘాటు కౌంటర్‌

అమిత్‌షాకు బంగ్లాదేశ్ ఘాటు కౌంటర్‌

అమిత్‌షా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ మండిపడింది. ఆయనకు బంగ్లాదేశ్‌ గురించి ఏమీ తెలియనట్లుందని విదేశాంగమంత్రి అబ్దుల్‌ మోమెన్‌ వ్యాఖ్యానించారు. అమిత్‌ షా వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు భారత్‌-బంగ్లా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఈ ప్రపంచంలో చాలా మంది తెలివైనవారు ఉన్నారు, కొందరు ఇతరుల్ని చూస్తూ కూడా నమ్మరు. దాని గురించి తెలుసుకున్న తర్వాత కూడా అర్థం చేసుకోవడానికి ఇష్టపడరు. ఆయన (అమిత్ షా) అలా అనుకున్నట్లయితే బంగ్లాదేశ్ గురించి ఆయన పరిజ్ఞానం పరిమితం అని భావిస్తామన్నారు. బంగ్లాలో ఆకలితో ఎవరూ చనిపోవడం లేదన్నారు.

భారత్‌ కంటే చాలా వాటిలో ముందున్నాం

భారత్‌ కంటే చాలా వాటిలో ముందున్నాం

బంగ్లాదేశ్ ప్రస్తుతం షా దేశం ( భారత్‌) కంటే చాలా విషయాల్లో ముందుందని బంగ్లా విదేశాంగమంత్రి అబ్దుల్‌ మోమెన్‌ గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌లో 90 శాతం కంటే ఎక్కువ మందికి మరుగుదొడ్లు ఉన్నాయని, కానీ భారత్‌లో 50 శాతం మందికి సరైన మరుగుదొడ్లే లేవన్నారు. బంగ్లాదేశ్‌లో విద్యావంతులకు ఉద్యోగాల కొరత కూడా లేదన్నారు. చదువుకోని వారికి కూడా ఉపాధి కరువు లేదన్నారు. లక్ష మందికి పైగా భారతీయులు ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్నారని మోమెన్‌ గుర్తు చేశారు. మేం భారత్‌ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

  Babar Azam - 'Virat Kohli’s Advice Helped Me To Improve My Game' | Oneindia Telugu
  మోడీ దౌత్యానికి గండి కొట్టిన అమిత్‌షా

  మోడీ దౌత్యానికి గండి కొట్టిన అమిత్‌షా

  పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వారి ఓట్ల కోసం ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో అత్యవసరంగా పర్యటించి వచ్చారు. బంగ్లాదేశ్‌కు వెళ్లి అక్కడి ఆలయాన్ని మోడీ సందర్శించిన తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. బంగ్లాదేశీయుల ఓట్ల కోసం ప్రధాని మోడీ ఆ దేశం వెళ్లి గుళ్లు చుట్టి వస్తే.. ఆయన కేబినెట్‌ సహచరుడు, సన్నిహితుడు అయిన అమిత్‌షా ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన ప్రయత్నాలకూ, బెంగాల్లో బీజేపీకి పడే ఓట్లకు గండికొట్టినట్లు తెలుస్తోంది. భారత్‌ కంటే జీడీపీలో సైతం బంగ్లాదేశ్ మెరుగ్గా ఉందని తెలిసి కూడా ఆ దేశంపై షా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.

  English summary
  Responding to Union Home Minister Amit Shah’s comments that the poor people of Bangladesh come to India as they don’t have enough to eat in their own country, Bangladesh foreign minister A K Abdul Momen on Wednesday said that the minister’s knowledge of Bangladesh is “limited”. He also said such remarks are “unacceptable especially when relations between Bangladesh and India are so deep. Such remarks create misunderstanding.”
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X