వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో..భారత్‌ కంటే బంగ్లాదేశ్ వృద్ధి రేటే మెరుగ్గా ఉందట: ఏడీబీ నివేదిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మందగిస్తుండటం తెలిసిందే. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే భారత ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతుండగా తాజాగా ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ విడుదల చేసిన వృద్ధిరేట్లు మరింత ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌ కంటే బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉందని ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ గణాంకాలను విడుదల చేసింది. ద్రవ్యోల్బణంను స్థిరంగా ఉంచుతూనే వృద్ధిరేటును బంగ్లాదేశ్‌ క్రమంగా పెంచుకుంటూ పోతోందని నివేదిక వెల్లడి చేస్తోంది.

 భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాల కంటే బలహీనం: ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే.? భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాల కంటే బలహీనం: ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే.?

బంగ్లాదేశ్‌లో క్రమంగా పెరుగుతున్న వృద్ధి రేటు

బంగ్లాదేశ్‌లో క్రమంగా పెరుగుతున్న వృద్ధి రేటు

2016లో బంగ్లాదేశ్‌లో వృద్ధిరేటు 7శాతంగా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో 8శాతంకు చేరుకునే అవకాశాలున్నట్లు ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అంచనా వేస్తోంది. ఇక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న దేశాలు కూడా ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ వివరించింది. 2016లో భారత వృద్ధిరేటు చాలా బాగుండేదని ఇక ఆ తర్వాత క్రమంగా పడిపోతూ వస్తోందని ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ స్పష్టం చేసింది.

7శాతం వృద్ధి రేటు అందుకోవడం భారత్‌కు కష్టమే

7శాతం వృద్ధి రేటు అందుకోవడం భారత్‌కు కష్టమే

అమ్మకాలు గణనీయంగా పడిపోగా, పారిశ్రామిక ఉత్పత్తి కూడా తగ్గడంతో భారత్ 7శాతం వృద్ధి రేటును అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తోందని ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ చెబుతోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ సమయానికి వృద్ధి రేటు 7.2శాతానికి చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయని ఏడీబీ అంచనా వేసింది.

భారత్‌లో వ్యవసాయ రంగం వైపే అత్యధిక జనాభా

భారత్‌లో వ్యవసాయ రంగం వైపే అత్యధిక జనాభా

బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలిస్తే భారత్‌తో చాలా వ్యత్యాసం కలిగి ఉంది. భారత వృద్ధి రేటులో సేవా రంగం కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే పారిశ్రామిక రంగంలో మాత్రం వృద్ధి నిరాశ కలిగిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో పారిశ్రామిక రంగం వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. దీంతో బంగ్లాదేశ్‌లో ఉద్యోగాల కల్పన బాగా ఉంటోంది. ఇక భారత్‌లో చూస్తే అత్యధిక జనాభా వ్యవసాయరంగానికి పరిమితమైందని ఏడీబీ చెబుతోంది. ఇది జీడీపీలో తన వంతు పాత్ర చాలా తక్కువగా పోషిస్తోందని వెల్లడించింది. వ్యవసాయ వైపు చాలా మంది మొగ్గు చూపడంతో పారిశ్రామిక రంగంలో మ్యాన్ పవర్‌కు కొరత ఏర్పడిందని ఏడీబీ తెలిపింది. దీంతో భారత్‌లో ఉద్యోగ కల్పన కూడా సవాలుగా మారినట్లు ఏడీబీ నివేదిక తెలుపుతోంది.

2019లో బంగ్లాలో పెరిగిన ఎగుమతులు

2019లో బంగ్లాలో పెరిగిన ఎగుమతులు

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ దేశీయ పరిశ్రమలు బలోపేతంగా తయారయ్యాయి. దీంతో బంగ్లాదేశ్ ఎగుమతులు 2018లో 6.7శాతంగా ఉండగా అది 2019 నాటికి 10.1శాతానికి పెరిగినట్లు ఏడీబీ నివేదిక చెబుతోంది. వస్త్రాల ఎగుమతి 8.8శాతంగా ఉంటే ఇప్పుడు అది 11.5శాతానికి చేరినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ మార్కెట్లకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, భారత్, జపాన్, చైనా, కొరియా దేశాల నుంచి మంచి డిమాండ్ ఉండటంతోనే ఇది సాధ్యమైనట్లు ఏడీబీ రిపోర్ట్ పేర్కొంది.

ఇతర దేశాల్లో మార్కెట్లను సృష్టించుకున్న బంగ్లాదేశ్

ఇతర దేశాల్లో మార్కెట్లను సృష్టించుకున్న బంగ్లాదేశ్


ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ మాత్రం తనకున్న పరిధిలోనే వస్తువులను ఎగుమతి చేస్తోందని ఏడీబీ తెలిపింది.ఇతర దేశాల్లో తనకంటూ ఓ మార్కెట్‌ను సృష్టించుకుని ఎక్కువ గార్మెంట్స్‌ను ఎగుమతి చేయడంతో భారత్‌ను గార్మెంట్ రంగంలో వెనక్కు నెట్టివేయగలిగిందని ఏడీబీ నివేదిక వెల్లడిస్తోంది. ఇదిలా ఉంటే 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు భారత ఎగుమతులు ఏడాదికి సరాసరిగా 1.5శాతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

English summary
The latest economic outlook update released by the Asian Development Bank has shown how Bangladesh, and not India, is the standout economy in terms of growth momentum in South Asia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X