వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: బెంగుళూరుకు నీటి సమస్య, కావేరీలో తగ్గిన నీటి మట్టం

వేసవి రాకముందే బెంగుళూరు నగరాన్ని మంచినీటి ఎద్దడి ఇబ్బంది పెడుతోంది. రానున్న రోజుల్లో మంచినీటి సరఫరాలో ఇంకా ఇబ్బందులు నెలకొనే అవకాశం ఉందని వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: వేసవి రాకముందే బెంగుళూరు నగరాన్ని మంచినీటి ఎద్దడి ఇబ్బంది పెడుతోంది. రిజర్వాయర్లలో మంచినీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో మంచినీటి సరఫరాలో రేషన్ విధానాన్ని అమలు చేయాలని వాటర్ బోర్డ్ భావిస్తోంది.అత్యధికంగా ఐటి కంపెనీలున్న ఈ నగరంలో మంచినీటి ఎద్దడి రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులను తెచ్చిపెట్టనుంది.

వేసవి ఇంకా రాకముందే బెంగుళూరు నగరాన్ని మంచినీటి సమస్య ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్య నుండి బయటపడేందుకుగాను ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

బెంగుళూరు నగరానికి నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన రెండు వారాలకే బెంగుళూరు నగరానికి నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వేసవి దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకొంటున్న సమయంలోనే రిజర్వాయర్లలో అనుహ్యంగా పడిపోతున్న నీటి మట్టాలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయని వాటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.

బెంగుళూరు వాసులకు నీటి కష్టాలు మొదలు

బెంగుళూరు వాసులకు నీటి కష్టాలు మొదలు

బెంగుళూరు మహనగరానికి త్వరలోనే నీళ్ళకు రేషన్ విధానాన్ని అమలు చేసేందుకు వాటర్ బోర్డు ప్రణాళికలను సిద్దం చేస్తోందని అధికారులు చెబుతున్నారు.నగరానికి నిరంతరాయంగా మంచినీటిని సరఫరా చేసేందుకుగాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వం ప్రకటించిన రెండు వారాలకే మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి.బెంగుళూరుతో పాటు ఇతర పట్టాణాలకు కూడ ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు.

కావేరీ జలాలే కర్ణాటకకు ఆధారం

కావేరీ జలాలే కర్ణాటకకు ఆధారం

మంచినీటి సరఫరాకు కావేరీ నది జలాలపైనే కర్ణాటక ఆదారపడుతోంది.అయితే ప్రధానంగా బెంగుళూరుతో పాటు ఇతర పట్టణాలకు మంచినీటి సరఫరాకు గాను కావేరీ నది జలాలపై ఆధారపడుతోంది.అయితే కావేరీ నదిలో నీటి మట్టం తగ్గిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.

మూడు గంటల నుండి రెండు గంటలకు తగ్గిన నీటీ సరఫరా

మూడు గంటల నుండి రెండు గంటలకు తగ్గిన నీటీ సరఫరా

బెంగుళూరు నగరానికి ప్రతి రోజూ ఉదయం ఐదున్నర గంటల నుండి మూడు గంటల పాటు మంచినీటిని సరఫరా చేస్తారు.అయితే రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో కేవలం రెండు గంటలపాటే నీటిని సరఫరా చేస్తున్నారు.డిస్ట్రిబ్యూషన్ లైన్ల చివర్లో ఉన్న ఇళ్ళకు నీటి సరఫరా జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. మురికి నీళ్ళు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. బెంగుళూరు వాటర్ బోర్డు అనధికారికంగా వాటర్ రేషనింగ్ ను మొదలు పెట్టిందని స్థానికులు చెబుతున్నారు.

నీటికి పెరిగిన డిమాండ్

నీటికి పెరిగిన డిమాండ్

ఉష్ణోగ్రతలు పెరగడంతో నీటికి డిమాండ్ పెరిగింది. బోర్ వెల్స్ కూడ ఫెయిల్ కావడంతో పాటు కావేరీ జలాలపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. కానీ, నదిలో నీళ్ళు తగ్గడంతో ప్రెషర్ కూడ తగ్గిపోతోందని వాటర్ బోర్డు చైర్మెన్ తుషార్ గిరినాథ్ చెప్పారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో రోజుకు కనీసం 1500 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.అయితే రానున్న రోజల్లో నీటి సరఫరా బాగా తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

English summary
banglore people to face water problem before summer. bangalore water board will implement water ration soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X