వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకు ఖాతాలకు ఏప్రిల్ 30లోపుగా ఆధార్ లింక్ చేయాలి, లేకపోతే ఇక అంతే.....

కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకొంది.ఈ నెల 30వ, తేదిలోపుగా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ వివరాలను అనుసంధానం చేయాలని ఆదాయపు పన్నుశాఖ ఆదేశించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకొంది.ఈ నెల 30వ, తేదిలోపుగా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ వివరాలను అనుసంధానం చేయాలని ఆదాయపు పన్నుశాఖ ఆదేశించింది.

ఈ నెల 30వ, తేదిలోపుగా ఆధార్ ను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయకపోతే ఆయా బ్యాంక్ ఖాతాలను బ్లాక చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు జూలై 2014 నుండి ఆగష్ట్ 2015 లోపు బ్యాంక్ ఖాతా తెరిచిన వారు ఆధార్ వివరాలతో పాటు కెవైసీ వివరాలను కూడ ఆయా బ్యాంకుకు సమర్పించాలని సూచించింది.

 Bank account holders link with aadhaar before April 30

విదేశీ పన్నుల అమలు చట్టానికి లోబడే ఖాతాదారులు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని ఐటీశాఖ కోరింది.ఈ డెడ్ లైన్ కు లోబడి అందరూ వివరాలు సమర్పించాలని లేని పక్షంలో ఖాతాను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది.

ఆ తర్వాత బ్యాంకు ఖాతాల నుండి ఎటువంటి లావాదేవీలకు అవకాశం ఉండదని ఐటీ శాఖ తేల్చి చెప్పింది. సదరు బ్యాంకులు కూడ ఈ మేరకు ఖాతాదారులను అప్రమత్తం చేయాలని సూచించింది.

English summary
Account holders are informed that in case self certifications are not provide till 30, April, 2017 Accounts, would be blocked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X