వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగదు ఇవ్వ లేదని విరాళాలతో భార్య అంత్యక్రియలు నిర్వహించాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ :పెద్ద నగదు నోట్ల రద్దుతో అంత్యక్రియలు నిర్వహించేందుకు డబ్బులు లేక ఓ సీనియర్ సిటిజన్ స్థానికుల విరాళాలలో తన భార్య అంత్యక్రియలను నిర్వహించాడు. తన ప్రత్యేక పరిస్థితులను వివరించినా బ్యాంకు అధికారులు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే స్థానికులు విరాళాలు ఇచ్చి అందుకోవడంతో తన భార్య అంత్యక్రియలు నిర్వహించాడు.ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

జార్ఖండ్ రాష్ట్రంలోని లాతేహర్ జిల్లా బ్రిష్ రాంపూర్ కు చెందిన జ్యూయర్ కాజూర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. అనారోగ్య కారణాలతో ఆయన భార్య హీరామని కాజూర్ గురువారం ఉదయం మరణించింది.ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయనకు పదివేల రూపాయాలు అవసరం వచ్చాయి.

అయితే తన భార్య అంత్యక్రియలు నిర్వహించేందుకుగాను కాజూర్ బ్యాంకుకు వెళ్ళాడు. ఈ నగదును ఉపసంహరించుకొనేందుకుగాను మేనల్లుడితో కలిసి ఎస్ బి ఐ బ్యాంకుకు వెళ్ళాడు. అయితే కాజూర్ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి క్యాషియర్ నిరాకరించాడు.

bank can't pay senior citizen ten thousand for wife's last rites

ప్రత్యేక పరిస్థితులను కాజూర్ బ్యాంకు సిబ్బందికి వివరించారు. అయితే బ్యాంకు సిబ్బంది మాత్రం నాలుగువేల రూపాయాలకంటే అధికంగా డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే తన భార్య అంత్యక్రియలకు కనీసంద పదివేల రూపాయాలు అవసరమౌతాయని బ్యాంకు సిబ్బందిని ఆయన ఆర్థించాడు. అయితే వారు ససేమిరా అన్నారు.నాలుగు వేల రూపాయాలను తీసుకొని ఆయన ఇంటికి వచ్చాడు.

దీంతో తన భార్య అంత్యక్రియలకు పదివేల రూపాయాలు అవసరమౌతాయి. కాని, బ్యాంకు సిబ్బంది నాలుగువేల రూపాయాలను మాత్రమే ఇచ్చారని ఆయన గ్రామస్థులకు చెప్పాడు.అయితే గ్రామస్థులు ఆయన భాదను చూసి చలించిపోయారు. గ్రామస్థులు ఆయన భార్య అంత్యక్యియలకు సహకరించారు. తమ వద్ద ఉన్న నగదును ఇచ్చి వారికి సహకరించారు. గ్రామస్థుల సహకారంతో ఆయన తన భార్య అంత్యక్రియలను నిర్వహించాడు.తన భార్య అంత్యక్రియలకు సహకరించిన వారికి బ్యాంకు నుండి తిరిగి నగుదను తెచ్చి ఇస్తానని ఆయన చెప్పారు. సకాలంలో విరాళాలు ఇచ్చి అంత్యక్రియలు జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

English summary
A senior in jharkhand's latehar district had to raise money from neighbours and acquaitances to cremtate his wife after his bank turned down his request for a cash withdrawal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X