వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు తెలియకపోవచ్చు: మీ ఖాతాల నుంచి ఈ కోతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని అత్యధికులకు బ్యాంకు ఖాతాలుంటాయనే విషయంలో సందేహం అక్కర్లేదు. కానీ, చాలా మందికి వాళ్ల ఖాతాల్లోంచి వివిధ రకాలైన చార్జీల రూపంలో కోత విధిస్తుందనే విషయం తెలియదు. నిజానికి, ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలో ఆ చార్జీలు క్రోడీకరించి ఉంటాయి. కానీ చాలా మంది వాటిపై దృష్టిపెట్టరు.

బ్యాంకులు మీ ఖాతాల నుంచే ఆ చార్జీలను వసూలు చేస్తాయి. తమ ఖాతాలో కోతలు పడిన విషయం ఖాతాదారులకు బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే తెలిసి వస్తుంది. ఈ స్టేట్‌మెంట్ కొంత మంది హార్డ్‌కాపీల రూపంలో వస్తుంది. కొంత మందికి ఈ మెయిల్‌లో కూడా వస్తుంది. అయినా కూడా చాలా మంది వాటిపై దృష్టి పెట్టరు. అయితే ఆ చార్జీలు ఏమిటో చూద్దాం.

మినిమం బ్యాలెన్స్

మినిమం బ్యాలెన్స్

ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉండాలని బ్యాంకులు చెబుతుంటాయి. ఈ మినిమం బ్యాలెన్స్ మొత్తం ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు మీకు పెనాల్టీ వేస్తాయియ. మీ ఖాతా నుంచి ఆ పెనాల్టీని లాగేస్తాయి.

 చెల్లింపుల నిలిపివేత

చెల్లింపుల నిలిపివేత

మీరు ఓ వ్యక్తికి చెక్కు ఇచ్చి ఉంటారనుకోండి. ఆ చెక్కు చెల్లకుండా చేయాలని అడిగితే కూడా మీ ఖాతాలో నుంచి కొంత మొత్తం కోత పడుతుంది. కొంత మంది ఖాతాదారులకు మాత్రం కొన్ని బ్యాంకులు మినహాయింపునిస్తాయి.

 డెబిట్ కార్డు ఫీజు

డెబిట్ కార్డు ఫీజు

డెబిట్ కార్డు ఫీజు రూ. 100 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఈ ఫీజు కూడా ఒక్కో బ్యాంకుకు ఒక్కో రకంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఎటిఎం కార్డు తీసుకున్నా దానిపై కూడా ఫీజు పడుతుంది.

 ఈ మెయిల్/ ఎస్ఎంఎస్ అలర్డ్

ఈ మెయిల్/ ఎస్ఎంఎస్ అలర్డ్

బ్యాంకులు మీ ఖాతా నుంచి ఈ మెయిల్/ ఎస్ఎంఎస్ అలర్డ్ డబ్బులను కూడా వసూలు చేస్తాయి. వాటిని ఖాతా నుంచే వసూలు చేసుకుంటాయి.

 బ్యాంకు స్టేట్‌మెంట్

బ్యాంకు స్టేట్‌మెంట్

బ్యాంకులు ఉచితంగా స్టేట్‌మెంట్స్ ఇస్తాయి. కానీ ఎక్కువ స్టేట్‌మెంట్స్ కావాలంటే మాత్రం అదనపు చార్జీలను వసూలు చేసుకుంటాయి.

 స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్

స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్

స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌కు కూడా కొన్ని బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. అయితే, నిర్ణీత తేదీ నాటికి ఆ మొత్తం ఖాతాలో లేకపోతే మాత్రం పెనాల్టీ వసూలు చేస్తాయి.

 పాస్ట్‌వర్డ్ మరిచిపోతే...

పాస్ట్‌వర్డ్ మరిచిపోతే...

మీరు నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ మరిచిపోయినా, లేదంటే ఎటిం కార్డు పిన్ నెంబర్ మరిచిపోయినా చాలా బ్యాంకులు పైసలు వసూలు చేసుకుంటాయి. అయితే, చాలా బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ విషయంలో ఆన్‌లైన్ పాస్‌వర్డ్‌ను రికవర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాయి.

English summary
you may not know that bank charges for its services. lets talk about these charges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X