వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్.. అలర్ట్... బ్యాంకులు వారం రోజులు బంద్, ఎప్పుడంటే, స్తంభించిపోనున్న లావాదేవీలు..

|
Google Oneindia TeluguNews

వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో జనాలు ఇబ్బంది పడుతోన్నారు. వేతన సవరణ కోసం సమ్మె చేస్తోన్న ఉద్యోగులు.. వచ్చే నెలలో కూడా మూడు రోజులు సమ్మె చేస్తామని పిలునిచ్చారు. దీనికి తోడు నాలుగురోజులు సెలవులు కూడా వస్తోన్నాయి. దీంతో వారం రోజులు బ్యాంకులు పనిచేయవు. దీంతో డబ్బులు అవసరం ఉన్నవారు, చెక్కుల క్లియర్ చేయాల్సిన వారు ప్లాన్ చేసుకుంటే బెటర్.

బ్యాంకులు తెరవకుంటే చెక్కుల క్లియరెన్స్ ఇబ్బంది ఉంటుంది. రోజువారీగా జరిగే లావాదేవీలకు ఎఫెక్ట్ ఉంటుంది. వేతన సవరణ కోసం ఉద్యోగులు సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం మహా శివరాత్రి కాగా, శనివారం నాలుగో శనివారం బంద్, తర్వాత ఆదివారం కావడంతో లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ఫిబ్రవరి ఇలా గడిస్తే.. మార్చిలో ఏకంగా వరసగా వారం రోజులు బ్యాంకులు పనిచేయవు.

Bank closes in march: remain closed for 7 days in march 2020

మార్చి 8 ఆదివారం ఎలాగూ బ్యాంకులు పనిచేయవు. 10వ తేదీన హోళీ వచ్చింది. అంటే సోమవారం ఒక్కరోజు మాత్రమే బ్యాంకు ఓపెన్ చేస్తారు. మంగళవారం 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూడురోజులు ఉద్యోగులు సమ్మె చేస్తామని ప్రకటించారు. 14వ తేదీ రెండో శనివారం, 15వ తేదీ ఆదివారం వచ్చాయి. దీంతో దాదాపు వరసగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. మళ్లీ బ్యాంకు లావాదేవీలు సోమవారం అంటే 16వ తేదీ నుంచి మొదలవుతాయి.

English summary
Bank closes in march: Bank closes in march in seven days, 4 days are holidays and three days employees go to strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X