వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.11 వేల కోట్ల డిపాజిట్ సామర్థ్యం ఉంటే.. రూ. 25 వేల కోట్ల అవినీతి ఎలా : అజిత్ పవార్

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన అజిత్ పవార్ అందుకు గల కారణాలను వివరించారు. తన వల్ల శరద్ పవార్‌కు చెడ్డ పేరు రావొద్దనే రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌కు ఈ ముదిమి వయస్సులో తన వల్ల బ్యాడ్ నేమ్ రావొద్దన్నారు. అందుకోసమే తన ఎమ్మెల్యే పదవీని తృణపాయంగా వదిలేశానని స్పష్టంచేశారు.

మహారాష్ట్రలో జరిగిన కో ఆపరేటివ్ బ్యాంకుతో శదర్ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదని అజిత్ పవార్ అన్నారు. కానీ కావాలనే కొందరు ఇరికించారని మండిపడ్డారు. సీనియర్ నేతను స్కాంలోకి లాగాల్సిన అవసరం ఎవరికీ ఉందో అర్థం చేసుకోవాలన్నారు. తాను ఈ స్థితికి రావడానికి శదర్ పవారే కారణమని తేల్చిచెప్పారు. శరద్ పవార్ తనకు బంధువు కావడం వల్లే అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో పావును తాను కాకుడదని నిర్ణయించుకొని ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశానని పేర్కొన్నారు.

bank deposit capacity 11k crore.. how 25k cr scam : ajit pawar

కో ఆపరేటివ్ బ్యాంకులు రైతులకు రుణాలనిస్తూ సహాయం చేస్తుంటాయని అజిత్ పవార్ గుర్తుచేశారు. ఆయా సమయాల్లో రుణాలు పక్కదారి పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. నాలుగు చక్కెర సహకార సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇచ్చిందని అజిత్ పవార్ గుర్తుచేశారు. మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు డిపాజిట్ సామర్థ్యం 11 వేల 500 కోట్లు అని అజిత్ పవార్ స్పష్టంచేశారు. మరీ రూ.25 వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఇందులో అవినీతి కన్నా కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

English summary
ncp leader ajit pawar resign his mla post. maharashtra co-opeartive bank scam issue ncp chief sharad power bad name. thats why decided to resign mla post ajit told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X