వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్టోబర్ 22న బ్యాంకు ఉద్యోగుల సమ్మె... విలీనానికి నిరసనగా బంద్

|
Google Oneindia TeluguNews

జాతీయ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియోషన్, బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్‌లు ఉమ్మడిగా సమ్మె చేస్తున్నట్టు ఇండియన్ బ్యాంకు అసోసియోషన్‌కు నోటీసులు అందించాయి.

బ్యాంకింగ్ సంస్కరణలతో పాటు కేంద్ర ఆర్ధిక మందగమనానికి తోడుగా బ్యాంకుల నష్టాల కారణంగా రెండు నెలల క్రితం బ్యాంకుల విలీనం పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకుల్లో విలీనం చేస్తన్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ఇండియాలో ఉన్న 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండగా నాటీ ప్రకటనతో దేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని ఆమె తెలిపారు.

Bank employees will go on a 24-hour long strike on October 22

అయితే బ్యాంకుల వీలీనంపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసిన ఉద్యోగుల యూనియన్లు వీలీన ప్రక్రియ ప్రారంభం కావడంతో మరోసారి తమ నిరసన వ్యక్తం చేసేందుకు సిద్దమయ్యారు. బ్యాంకుల విలీనం వల్ల అనేక వేల ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయో అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల ఎగవేత దారుల నుండి డబ్బును రికవరి చేయడం ద్వార బ్యాంకుల కష్టాలు తీరుతాయని.. అందుకోసం బ్యాంకుల విలీనం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. బ్యాంకింగ్ సంస్వకరణల పేరిట వినియోగదారులపై అధిక భారం వేయనున్నట్టు ఉద్యోగులు ఆరోపణలు చేశారు.కాగా సమ్మె నోటీసులో ఆరు కారణాలు పేర్కోన్నారు.

English summary
Bank employee unions will go on a 24-hour long strike on October 22 to protest against the recent bank mergers, falling deposit rates and a call for job security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X