వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: బ్యాంక్‌లోని ఓ మేనేజర్ రూ.84 లక్షల చిల్లర దొంగ, అసలు ఎలా తీసుకెళ్లాడో?

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: బ్యాంకులో పని చేసే ఓ సీనియర్ అధికారి తాను పని చేసే బ్యాంక్ నుంచి లక్షలాది రూపాయలను గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. ఎవరికీ అనుమానం రాకుండా దాదాపు సంవత్సరంన్నరగా అతను చిల్లర రూపంలో పెద్ద మొత్తాన్ని దొంగతనం చేశాడు.

రూ.84 లక్షల విలువ చేసే నాణేలను దొంగిలించి, ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు 82 కి.మీ దూరంలో ఉన్న మెమరీలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌లో బ్రాంచ్‌లో తారక్ జైస్వాల్‌ (35) సీనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్. బ్యాంక్‌ కరెన్సీ ఛెస్ట్‌లో విధులు నిర్వర్తించే వాడు. అక్కడ కొంతకాలంగా అందినకాడికి దోచుకున్నాడు.

 Bank manager steals coins worth Rs 84 lakh to buy lottery tickets in Bengal

ఎవరు గుర్తు పట్టకుండా వీలు చిక్కినప్పుడల్లా నాణేల రూపంలోనే అతను దోచుకునేవాడు. పదిహేడు నెలల్లో మొత్తం రూ.84 లక్షలను దొంగిలించాడు.
బ్యాంకులో వార్షిక ఆడిట్‌ను ఈ నవంబర్‌ 27వ తేదీన నిర్వహించారు. నాణేల లెక్కింపులో చాలా తేడా వచ్చింది. దీనిని అధికారులు గుర్తించారు. అప్పుడు జైస్వాల్‌ బ్యాంకుకు రావట్లేదు. అతడిపై అనుమానం వచ్చింది.

బ్యాంకుకు రావాలని అతనిని ఆదేశించారు. అతడు బ్యాంక్‌ ఛెస్ట్‌ తాళాలు తన భార్యకు ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత జైశ్వాల్ దొంగ అని గుర్తించారు. బ్యాంక్ మేనేజర్ అతనిపై ఫిర్యాదు చేశారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తాను చోరీ చేశానని, ఆ డబ్బుతో లాటరీ టికెట్లు కొన్నానని నిందితుడు అంగీకరించాడు.

ఒకవేళ రూ.10 నాణేల రూపంలోనే ఈ మొత్తాన్ని చోరీ చేసినా అతడు గత పదిహేడు నెలల్లో రోజుకు రెండు వేల నాణేలను తీసుకెళ్లి ఉండాలని అంటున్నారు. బ్యాంక్‌ నుంచి పెద్ద మొత్తంలో నాణేలను అతడు ఎలా బయటకు తీసుకు వెళ్లాడనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

English summary
No one would have slotted him as a thief or an embezzler; after all, Tarak Jaiswal had an unblemished record in the eight years he worked at the State Bank of India, the country’s biggest lender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X