వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ.. బ్యాంకు సిబ్బంది... పని ఒత్తిడిలో తాళం వేయడమే...

|
Google Oneindia TeluguNews

లక్నో : బ్యాంకులు.. నగదు, నగలు, ముఖ్యమైన పత్రాలు ఉంటాయి. అందుకే బ్యాంకుల వద్ద సెక్యూరిటీ కూడా ఉంటారు. రాత్రి పూట మాత్రం తాళం వేసి వెళుతుంటారు. కానీ యూపీలో ఓ బ్యాంకు ఉద్యోగులు చేసిన నిర్వాకం చర్చకు దారితీసింది. విధులు ముగిసిన తర్వాత అందరూ తాపీగా ఇంటికెళ్లిపోయారు. ఎలాగంటే సాదాసీదాగా వెళ్లారు. ఇందులో సందేహం ఏంటీ అని కదా మీ డౌట్.

అవును వారంతా వెళ్లిపోయారు. కానీ బ్యాంక్‌కు తాళం వేయకుండా వెళ్లిపోయారు. యూపీలోని ముజఫర్‌నగర్‌లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఘటన జరిగింది. నిన్న సిబ్బంది పనివేళలు ముగిసిన వెంటనే తలొదారిన వెళ్లిపోయారు. అయితే రాత్రి అవుతుంది. అర్థరాత్రి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూశాడు. బ్యాంకు తాళం లేని విషయం చూసి ఆశ్చర్యపోయాడు. కళ్లు తడుముకొని మరీ చూసి .. వెంటనే పోలీసులు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు బ్యాంకు వద్దకు పరుగులు తీశారు.

bank staff forget lock the door

అక్కడికి బ్యాంకు మేనేజర్‌ను కూడా పిలిపించారు. బ్యాంకుకు తాళం వేయలేదని పోలీసులు తెలియజేయడంతో .. మేనేజర్ నోరేళ్లబెట్టారు. బ్యాంకులో ఏమైనా పోయాయేమో అని తనిఖీ కూడా చేశారు. కానీ బ్యాంకులో నగదు, సామాగ్రి ఉన్నాయి. దీంతో కాస్త రిలీఫ్ అయ్యారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ నగదు, నగలు పరిస్థితి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. భద్రత ఉంటుంది కదా అని బ్యాంకులో వేస్తే ఇలాగేనా వ్యవహరించేది అని విమర్శిస్తున్నారు.

English summary
Union Bank of India staff in Muzaffarnagar in UP forgot to lock up. At midnight a man was seen tell to the police. The police immediately approached the bank and informed the manager.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X