వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకుల బంద్, ఉద్యోగుల ఆందోళన: కారణాలివే!

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం నాడు సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం నాడు సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన కార్మిక సంస్కరణలు, నానాటికి పెరిగిపోతున్న మొండి పద్దులకు ఉన్నత ఉద్యోగులు బాధ్యులను చేయడంతో పాటు ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది యూనియన్లకు సారథ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బియు) సమ్మెకు పిలుపునిచ్చింది.

రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె: కార్యకలాపాలకు ఆటంకం రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె: కార్యకలాపాలకు ఆటంకం

భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంస్థలైన నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. మరోవైపు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కొటాక్ మహేంద్ర బ్యాంకులు మాత్రం చెక్ క్లియరెన్సులు మినహా మిగతా సేవలు సాధారణంగా ఉంటాయని తెలిపింది.

Bank Strike On 28 February Demanding Recovery Of Bad Loans, Action Against Wilful Defaulters

కాగా, బ్యాంకుయూనియన్లతో కేంద్ర ప్రభుత్వ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వరంలో జరిగిన సమావేశంలో విఫలం కావడంతో ఈ సమ్మె అనివార్యమైంది. యూనియన్ల డిమాండ్లను బ్యాంకుల మేనేజ్‌మెంట్‌ బాడీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తిరస్కరించింది.

మొండి బకాయిలను రాబట్టడంలో బ్యాంకు ఉన్నతాధికారులు జవాబుదారీగా ఉండాలి, అన్ని స్థాయిల్లో ఖాళీల భర్తీ, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు కఠిన శిక్షలు వంటి పలు డిమాండ్లతో సమ్మెకు దిగనున్నట్లు యునైటెడ్ ఫోరం బ్యాంకు యూనియన్ (యుఎఫ్‌బియు) నేతృత్వంలోని బ్యాంకు సంఘాలు తెలిపాయి.

English summary
The All India Bank Employees' Association (AIBEA) has called a country-wide strike on 28 February to demand the recovery of bad loans and criminal action against wilful defaulters -- rather than creating a separate enetity to handle this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X