వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక తప్పించుకోలేరు: రుణఎగవేతదారులకు వాట్సాప్‌ ద్వారా బ్యాంకు సమన్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

రుణఎగవేతదారులకు వాట్సాప్‌ ద్వారా బ్యాంకు సమన్లు

బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని ఎగవేసే వారికి నోటీసులను వాట్సాప్ ద్వారా పంపుతున్నాయి ఆయా బ్యాంకులు. సాధారణ పద్దతుల ద్వారా అయితే నోటీసులు ఇంటికి కానీ వారి కార్యాలయాలకు కానీ బ్యాంకులు పంపేవి. ఇలా పంపడం ద్వారా నోటీసులు తమకు అందలేదనో లేక ఇతరత్ర కారణాలు చూపి మొత్తానికి రుణాలు కట్టకుండా కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇక లాభం లేదని భావించిన బ్యాంకులు వాట్సాప్ ద్వారా వారికి మెసేజ్ లేదా నోటీసులు పంపుతున్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు మరికొన్ని బ్యాంకులు డిజిటల్ పద్దతిని ఆశ్రయిస్తున్నాయి.

వాట్సాప్‌లో సమన్లు పంపిస్తే తప్పించుకునే అవకాశం తక్కువ

వాట్సాప్‌లో సమన్లు పంపిస్తే తప్పించుకునే అవకాశం తక్కువ

నోటీసులను పోస్టులో పంపితే... అది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది లేదా అడ్రస్‌ మారామని చెప్పే అవకాశం లేకపోలేదు. కానీ ఫోన్‌ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు అంత తేలిగ్గా మార్చేందుకు కుదరదు కాబట్టే ఈ కొత్త పద్దతిని ఆశ్రయించినట్లు బ్యాంకులు తెలుపుతున్నాయి. మరోవైపు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిస్తే బ్లూ కలర్ టిక్ మార్కులు కనిపిస్తున్నాయంటే... అవతల వ్యక్తి మెసేజ్‌ను చదివినట్లే. దీంతో తను నోటీసులు చదవలేదని లేక నోటీసులు అందలేదని చెప్పే అవకాశం ఉండదు. అయితే కొత్తగా వాట్సాప్‌లో ఓ ఆప్షన్ వచ్చింది. వచ్చిన మెసేజ్‌లను చదివినట్లుగా అవతల వ్యక్తికి తెలియకుండా ఉండేందుకు ఆ ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తే సరిపోతుంది.

వాట్సాప్ ద్వారా 214 సమన్లను పంపిన హెచ్‌డీఎఫ్‌సీ

వాట్సాప్ ద్వారా 214 సమన్లను పంపిన హెచ్‌డీఎఫ్‌సీ

ఇప్పటికే గత రెండు నెలల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కోర్టు ద్వారా 214 సమన్లు వాట్సాప్‌ ,ఈమెయిలో పంపింది. ఇవి తమిళనాడు, గుజరాత్, పంజాబ్, హర్యాణా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, అస్సోం, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రుణాలు ఎగవేసిన వారికి కోర్టు నుంచి వాట్సాప్‌లో కానీ , ఈమెయిల్స్ ద్వారా కానీ సమన్లు వెళ్లాయి. ఇందులో ఎక్కువగా చెక్ బౌన్స్ కేసులు, రుణాలు ఎగవేసిన కేసులు ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారి ఒకరు వెల్లడించారు. బ్యాంకు నుంచి కానీ కోర్టునుంచి కానీ సమన్లు పంపే అవకాశం ఉందని చెప్పిన ఆయన... నోటీసులు అందుకున్నప్పటికీ ఆయా వ్యక్తులు తమకు అందలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

వాట్సాప్‌ ఈమెయిల్ ద్వారా సమన్లు పంపొచ్చు: బాంబే హైకోర్టు

వాట్సాప్‌ ఈమెయిల్ ద్వారా సమన్లు పంపొచ్చు: బాంబే హైకోర్టు


జూన్‌లో బాంబే హైకోర్టు రుణాల ఎగవేత కేసుపై విచారణ చేస్తూ రుణాలు ఎగవేసే వారికి బ్యాంకులు వాట్సాప్ ద్వారా కూడా లీగల్ నోటీసులు పంపొచ్చని చెప్పింది. జూన్ 11న ఎస్బీఐకి బాకీ పడ్డ క్రెడిట్ కార్డుల బిల్లులపై విచారణ చేసింది బాంబే హై కోర్టు. జాదవ్ అనే వ్యక్తి క్రెడిట్ కార్డు బిల్లు కట్టని నేపథ్యంలో తాము నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి రిప్లై ఇవ్వనందున వాట్సాప్ ద్వారా తనకు సమాచారం అందించినట్లు బ్యాంకు కోర్టుకు తెలిపింది. క్రెడిట్ కార్డుల బిల్లు కట్టకుండా ఎగవేసిన వ్యక్తికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపడంపై జస్టిస్ జీఎస్ పటేల్ ఏకీభవించారు.

 1908 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసిజర్ ఏం చెబుతోంది..?

1908 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసిజర్ ఏం చెబుతోంది..?

ఇక దీనికే కాదు... రుణాల ఎగవేతలు, చెక్ బౌన్సుల కేసుల్లో కూడా నోటీసులను వాట్సాప్ ఈమెయిల్ ద్వారా పంపొంచ్చనే తీర్పును జస్టిస్ జీఎస్ పటేల్ ఇచ్చారు. 1908 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసిజర్ ప్రకారం ఒక వ్యక్తి కోర్టుకు హాజరు కావాలంటే... అతనికి లేదా ఆమెకు సమన్లు రిజిష్టర్ పోస్టు ద్వారానే పంపాలనే నిబంధన ఉండేది. కానీ ఏదైనా కారణాల చేత అవి పంపేందుకు వీలుకాకపోతే ఇతర పద్దతుల ద్వారా నోటీసులు చేరేలా చర్యలు తీసుకోవాలని ఉంది. ఇప్పుడు ఈ కేసులో కూడా డాక్యుమెంట్లను లేదా సమన్లను ఫలానా వ్యక్తికి చేరవేసేందుకు ఇతరపద్దతులైన వాట్సాప్, ఈ మెయిళ్లను వినియోగించడం జరుగుతోందని చెప్పింది కోర్టు.

ఇదే పద్ధతిని ఢిల్లీ కోర్టు ఈ ఏడాది మార్చిలో పాటించింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక మహిళ భర్తను భారత్‌లోని కోర్టుకు హాజరయ్యేందుకు సమన్లు వాట్సాప్, ఈమెయిల్ ద్వారా పంపించింది. ఇలా సోషల్ మీడియా ద్వారా నోటీసులు పంపించాలన్న ఆలోచన చాలా బాగుందని పలువురు న్యాయనిపుణులు చెబుతున్నారు. పలు కారణాలు చూపి చాలామంది కోర్టులకు హాజరుకాకుండా పోతున్నారని అలాంటి వారికి ఇలా వాట్సాప్ ద్వారా నోటీసులు పంపడం, సాంకేతికతను వినియోగించడం ముందడుగు అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
HDFC Bank and other lenders are using WhatsApp and email to pin down defaulters of various kinds, especially those who could slip through the cracks when more traditional means are employed. Such summons are being served through digital means following a judgement earlier this year. The post can get unduly delayed and addresses keep changing but phone numbers, WhatsApp IDs and email addresses are more constant, making digital notices less easy to dodge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X