వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: రూ.1 చెల్లించలేదని లక్షల విలువ బంగారాన్ని ఇవ్వని బ్యాంకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కాంచీపురం: విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి వారు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకొని విదేశాలకు పారిపోయారు. కానీ బ్యాంకులు లేదా ఇతర సంస్థల నుంచి చిన్న మొత్తం తీసుకున్న వారిని మాత్రం డబ్బు కట్టమంటూ వేధిస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో వెలుగు చూసింది.

మరీ షాకింగ్ విషయం ఏమంటే ఓ సామాన్యుడు తాను లోన్‌గా తీసుకున్న డబ్బు మొత్తాన్ని చెల్లించాడు. కానీ వారి లెక్కల్లో ఒక్క రూపాయి ఇంకా చెల్లించాలి అని రికార్డు అయి ఉంది. దీంతో అతను తనఖా పెట్టిన లక్షలాది రూపాయల బంగారు నగలను ఇచ్చేందుకు నిరాకరించారు.

ఈ సంఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటు చేసుకుంది. ఇక్కడి కో-ఆపరటేవ్ బ్యాంకు కేవలం రూ.1 బాకీ ఉన్నాడని అతనికి చెందిన రూ.3.5 లక్షల విలువ చేసే 169 గ్రాముల బంగారాన్ని ఇవ్వలేదు. గత కొన్నేళ్ల నుంచి తన బంగారాన్ని ఇవ్వకపోవడంతో అతను సహకార బ్యాంకును కోర్టుకు లాగాడు.

Banks can let big borrowers escape but default on just Re 1 can prove costly

కాంచీపురంలోని పల్లవరమ్ బ్రాంచి కో-ఆపరేటివ్ బ్యాంకులో సి కుమార్ అనే వ్యక్తి మూడు పర్యాయాలు లోన్ తీసుకున్నారు. అతను తొలుత 31 గ్రాముల బంగారాన్ని 6 ఏప్రిల్ 2010 తాకట్టు పెట్టి రూ.1.23 లక్షల లోన్ తీసుకున్నారు. 9 ఫిబ్రవరి 2011న 85 గ్రాముల బంగారం పెట్టి రూ.1.05 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత మరో 53 గ్రాముల బంగారంతో రూ.60వేల లోన్ తీసుకున్నాడు.

అయితే అతను మొదటిసారి తీసుకున్న లోన్‌కు సంబంధించి రూ.1 (ఒక్క రూపాయి) పెండింగులో ఉంది. ఆ తర్వాత తీసుకున్న రెండు లోన్లను చెల్లించాడు. కానీ ఒక్క రూపాయి కోసం అతని బంగారాన్ని అప్పగించలేదు.

దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బ్యాంకు పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే తన బంగారు నగల విషయంలో అనుమానం వ్యక్తం చేసిన సదరు వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

English summary
After so many loan scams in the past few years, many may rightly think a borrower can get away after defaulting on crores of rupees. But small borrower may have no such luck. While runaway diamond merchant Nirav Modi gamed the banking system for huge amounts of money, an innocent borrower landed in trouble for defaulting on just Re 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X