ఊరట: చిరిగిన నోట్లు తీసుకోని బ్యాంకులకు రూ.10వేల ఫైన్
ఇక నుంచి బ్యాంకులు బాగా మరకలు అంటిన, చిరిగిన నోట్లను తీసుకోకుంటే.. వారికి బ్యాంకులు రూ.పదివేల ఫైన్ కట్టవలసి ఉంటుంది.
న్యూఢిల్లీ: ఇక నుంచి బ్యాంకులు బాగా మరకలు అంటిన, చిరిగిన నోట్లను తీసుకోకుంటే.. వారికి బ్యాంకులు రూ.పదివేల ఫైన్ కట్టవలసి ఉంటుంది.
అదే సమయంలో ఓ వ్యక్తి ఇరవై నోట్ల కంటే ఎక్కువ లేదా రూ.5,000 నోట్లను మార్చుకుంటే బ్యాంకు దాని పైన సర్వీస్ ఛార్జీ విధిస్తుంది.

కాగా, రద్దయిన ఐదు వందల రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను పది కన్నా ఎక్కువ సంఖ్యలో కలిగి ఉండడం ఇక నేరం. ఈ మేరకు పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్ట రూపం దాల్చింది. బిల్లుకు గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కనీసం రూ.10వేలు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications