• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీ ఎన్నికలు: ఒబామాపై బీజేపీ ఆశ, కేజ్రీవాల్ ఏడుస్తున్నారని బేడీ

By Srinivas
|

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. దేశ రాజధాని కావడం వల్ల తరుచూ అంతర్జాతీయ కార్యక్రమాలకు ఢిల్లీ వేదిక అవుతుండటం మామూలే. ఢిల్లీలో భారీ సంఖ్యలో ఉన్న పట్టణ మధ్యతరగతి ప్రజలు స్థానికంగా జరిగే అంతర్జాతీయ కార్యక్రమాల పైన ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తారు.

ఎన్నికల వేళలో ఇది కీలకంగా మారుతోంది. దీనిని బీజేపీ ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఒబామా పర్యటన కలిగించిన సానుకూల ప్రభావం విషయంలో ఢిల్లీ బీజేపీ నేతలు ఆనందాన్ని దాచుకోలేకపోతున్నారంటున్నారు. ఒబామా పర్యటనను ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు అంతర్గతంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే, వీటిని అధికారికంగా బీజేపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఒబామా పర్యటన ఢిల్లీ మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకుంటుందని, అది తమకు లాభిస్తుందని విశ్వసిస్తున్నట్లుగా తెలుస్తోంది. 48 శాతం మంది మధ్యతరగతి ఓటర్లు ఉన్నారు.

Barack Obama visit may brighten BJP's chances in Delhi polls, Kejriwal 'Playing Sob Sob', Says Kiran Bedi

మోడీ చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో అమెరికా కీలకపాత్ర పోషిస్తుందని, అప్పుడే మోడీ పెట్టుబడులు, ఉద్యోగ కల్పనపై తానిచ్చిన హామీలను నెరవేర్చగలరని సాఫ్టువేర్ ఇంజనీర్‌లు కూడా అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. పౌర అణు ఒప్పందంపై ఆరేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయేలా చేయడంలో మోడీ విజయం సాధించడం కీలకమంటున్నారు.

మోడీ, ఒబామా సమావేశాల నుండి కీలక అంశాలను తీసుకొని, వాటిని ప్రచార కార్యక్రమాల్లో చేర్చాలంటూ పార్టీ అధ్యక్షులు అమిత్ షా ఢిల్లీ బీజేపీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. న్యూయార్క్ మాడిసిన్ స్క్వేర్లో మోడీ చేసిన ప్రసంగాన్ని పదేపదే చూపించడం ద్వారా మహారాష్ట్ర ఎన్నికల్లో పట్టణ మధ్యతరగతి ఓటర్లను గతంలో ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే పునరావృతం చేయాలని చూస్తున్నారు.

కేజ్రీవాల్ పైన కిరణ్ బేడీ..

గణతంత్ర దినోత్సవ వేడుకలకు తనను ఆహ్వానించలేదని ఏఏపీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ చిన్నపిల్లాడిలో ఏడుస్తున్నాడని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ విమర్శించారు. తనకు ఆహ్వానం అందలేదని కేజ్రీవాల్ వెక్కి వెక్కి ఏడుస్తున్నారని, ఆయన ఇంకా ఎదగాల్సి ఉందన్నారు. ఆహ్వానాలు కోరుకుంటేనే, డిమాండ్ చేస్తేనో రావన్నారు. నిబంధనలు, ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా వస్తాయన్నారు.

English summary
BJP's chief ministerial candidate Kiran Bedi, who attended the Republic Day celebrations today, mocked the Aam Aadmi Party rival Arvind Kejriwal for "playing sob sob" over not being invited on the occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X