వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత ఆటవికమా?: కేరళలో బహిరంగంగా గోవును వధించడంపై రాహుల్ ఆగ్రహం

కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా ఆవును వధించడంపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు తనకు, తన పార్టీకి ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా ఆవును వధించడంపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు తనకు, తన పార్టీకి ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు.

అనాలోచితంగా, ఆటవికంగా ఈ చర్యకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆవును బహిరంగంగా వధించిన కారణంగా ముగ్గురు కేరళ కాంగ్రెస్ కార్యకర్తలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది.

Barbaric says Rahul Gandhi on cow slaughter by his party workers

కబేళాలకు పశువులను విక్రయించడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళ కాంగ్రెస్ యువజన విభాగం నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కొందరు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వాహనంలో అందరూ చూస్తూండగానే 18 నెలల వయసుగల ఆవును హత్య చేశారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆవు మాంసాన్ని అక్కడ ఉన్నవారికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సంఘటనపై విమర్శలు రావడంతో కొందరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Congress vice-president, Rahul Gandhi while condemning the slaughter of a cow by his party workers in Kerala termed the incident as barbaric and completely unacceptable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X