వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్ట్ బర్ఖాదత్ కు అసహ్యకరమైన, అశ్లీలమైన ఫొటోలు, సందేశాలు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్ సోమవారం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. అసహ్యకరమైన, జుగుప్సాకరమైన ఫొటోలు, సందేశాలు ఆమె వాట్సప్ కు షేర్ అయ్యాయి. అవే ఫొటోలు ట్విట్టర్ లోనూ కనిపించడంతో ఆమె బిత్తరపోయారు. వెంటనే ఈ విషయంపై ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వాట్సప్ ద్వారా తనకు అందిన ఈ ఫొటోలు, సందేశాలను స్క్రీన్ షాట్ తీసి ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తనకు అలాంటి సందేశాలను పంపించిన వారి ఫోన్ నంబర్లు బహిర్గతం కావాలనే ఉద్దేశంతోనే వాటిని పోస్ట్ చేసినట్లు బర్ఖా దత్ వివరణ ఇచ్చారు.

ఈ నెల 14వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదుల దాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం బర్ఖా దత్ విస్తృత స్థాయిలో కవరేజీ ఇస్తున్నారు. రక్షణ, రాజకీయ రంగానికి చెందిన పలువురితో వరుసగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. దీన్ని సహించని గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను టార్గెట్ గా చేసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Barkha Dutt alleges threat calls, publicises stalkers numbers

సోమవారం ఉదయం తనకు అశ్లీలకర ఫొటోలు, సందేశాలు అందిన వెంటనే ఆమె వాటి స్క్రీన్ షాట్ తీశారు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మాధుర్ వర్మకు ట్యాగ్ చేశారు. ఆదివారం రాత్రి కూడా తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని బర్ఖా దత్ పోలీసులకు తెలిపారు. 20 వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి తనకు కాల్స్ వచ్చాయని చెప్పారు. బిహార్ నుంచి అధికంగా బెదిరింపు ఫోన్లు వచ్చినట్లు చెప్పారు. బర్ఖాదత్ కు మాత్రమే కాకుండా, మరో ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు రావిష్ కుమార్, అభిసార్ శర్మ, స్వాతి చతుర్వేది కూడా ఇలాంటి అశ్లీలకర సందేశాలను అందుకున్నారు. వారు కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Noted journalist Barkha Dutt, who is a contributing editor of THE WEEK, on Monday revealed that she had been receiving threatening calls and explicit pictures on phone and Twitter and WhatsApp. Dutt also took the unprecedented step of publicising the phone numbers of individuals allegedly sending such messages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X