వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ లేఖలు: గాలి జనార్ధన్ కేసులపై చేతులెత్తేసిన సీబీఐ, రెండేళ్లుగా ప్రయత్నాలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిపై ఉన్న కేసుల మూసివేతకు రంగం సిద్ధమవుతోందా? రెండేళ్ల నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ జర్నలిస్ట్ బర్కాదత్. ఇందుకు రెండేళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ అకౌంటులో కొన్ని పత్రాలను ఉంచారు.

Recommended Video

అవసరమైతే శత్రువు సహాయమైన తీసుకోవడానికి మేం రెడీ

కర్నాటకలో ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ రెండేళ్ల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసిందని, గాలిని ఉపయోగించుకోవడం ద్వారా కర్నాటకలో గెలవాలని వ్యూహాత్మకంగా పావులు కదిపిందని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా మైనింగ్ కేసులను టెక్నికల్ కారణాలతో మూసివేయాలని నిర్ణయించిందట. కేసును ప్రాథమిక దశలోనే సమాధి చేయాలని చూస్తోందంటున్నారు.

2+1పై మోడీకి సిద్ధూ కౌంటర్, అందుకే బీజేపీ అధికారంలోకి రాదు: ప్రకాశ్ రాజ్2+1పై మోడీకి సిద్ధూ కౌంటర్, అందుకే బీజేపీ అధికారంలోకి రాదు: ప్రకాశ్ రాజ్

ఆ లెక్కలు మేం తేల్చలేం.. చేతులెత్తేసిన సీబీఐ!

ఆ లెక్కలు మేం తేల్చలేం.. చేతులెత్తేసిన సీబీఐ!

గోవాలోని రెండు పోర్టులన నుంచి గాలి ఎంత ఖనిజాన్ని అక్రమంగా తరలించారన్న లెక్కలను తాము తేల్చలేమని పేర్కొంటూ 2017 జూన్ 13వ తేదీన గోవా సీబీఐ (అవినీతి నిరోధక) విభాగం కర్నాటక ప్రభుత్వానికి రాసిన మూడు పేజీల లేఖను బర్కాదత్ ట్విట్టర్‌లో పోస్టు చేసారు.

ఎలా సమాధి చేస్తోందో ఇవి చెబుతున్నాయి

ఎలా సమాధి చేస్తోందో ఇవి చెబుతున్నాయి

గాలి సోదరులపై ఉన్న మైనింగ్ కేసును సీబీఐ ఎలా సమాధి చేస్తుందో ఇవి చెబుతున్నాయని, మార్మ గోవా, పనాజీ పోర్టులన నుంచి అక్రమంగా ఎగుమతి చేసిన ఖనిజంలో గోవా, కర్నాటకలకు చెందిన ఖనిజం ఎంత ఉందో వేరు చేసి చెప్పడం అసాధ్యమని సీబీఐ చెబుతోందని బర్కాదత్ పేర్కొన్నారు.

2006-2011 మధ్య లెక్కలు లేవు

2006-2011 మధ్య లెక్కలు లేవు


దేశంలోని నాలుగు రాష్ట్రాలలోని తొమ్మిది పోర్టుల నుంచి 12వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజం అక్రమంగా రవాణా అయిందని అంచనా. ఇందులో గాలికి చెందిన కంపెనీలు ఎంత మేర ఎగుమతి చేశాయనే లెక్కలు తేల్చాలని కోరుతూ కర్నాటక ప్రభుత్వం 2013లో సీబీఐని కోరింది. అయితే, ఎంతోమంది ఖనిజాన్ని ఎగుమతి చేస్తుంటారని, అందువల్ల అలా కలిపి ఎగుమతి చేసిన దాంట్లో కర్నాటక, గోవాలది ఎంత ఉందో లెక్కలు తేల్చడం సాధ్యం కాదని, 2006, 2011 మధ్య కాలంలో మార్మ గోవా, పనాజీల నుంచి ఎగుమతి అయిన ఖనిజం లెక్కలు పోర్ట్ అథారిటీ వద్ద లేవని సీబీఐ అధికారి ఆ లేఖలో పేర్కొన్నట్లుగా ఉంది.

2006-2011 మధ్య సమాచారం లేనప్పుడు పరిగణలోకి తీసుకోలేం

2006-2011 మధ్య సమాచారం లేనప్పుడు పరిగణలోకి తీసుకోలేం

సంబంధిత యంత్రాంగం వద్ద సమాచారం లేనప్పుడు దానిని నేర విచారణకు పరిగణలోకి తీసుకోవడం వీలు కాదని, ఎంఎండీఆర్‌ చట్టం ప్రకారం ఎగుమతిదారులు అన్ని రకాల డాక్యుమెంట్లను తప్పనిసరిగా తమ దగ్గర ఉంచుకోవాలన్న నిబంధనేమీ లేదని న్యాయ నిపుణులు చెప్పారని, 2006 నుంచి 2011 వరకు మార్మ గోవా, పనాజీల నుంచి16 పెద్ద కంపెనీలు ఖనిజాన్ని ఎగుమతి చేశాయని, ఎగుమతి కోసం కర్నాటక డీఎంజీ ఇచ్చిన దాని కంటే తక్కువనే ఎగుమతి అయిందని సీబీఐ అధికారి పేర్కొన్నారని తెలుస్తోంది.

ఏపీలోని 3 పోర్టుల రవాణాపై దర్యాఫ్తు కొనసాగుతోంది

మరోవైపు, చెన్నై, మంగళూరు పోర్టుల నుంచి జరిగిన అక్రమ ఎగుమతులపై విచారణ చేపట్టిన చెన్నై, బెంగుళూరు సీబీఐ శాఖలు కూడా 2017 నవంబరు ఎనిమిదో తేదీన ఇలాంటి లేఖలను కర్ణాటక ప్రభుత్వానికి రాసినట్లుగా పేర్కొన్నారు. ఏపీలోని మూడు పోర్టుల నుంచి జరిగిన అక్రమ రవాణాపై ఇప్పటికీ సీబీఐ దర్యాప్తు జరుపుతున్నట్లు సీబీఐ పేర్కొంది. ఇదిలా ఉండగా, గోవా, బెంగళూరు, చెన్నై బ్రాంచ్ సీబీఐ అధికారుల లేఖల నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఈ కేసులను సీబీఐ విచారణ నుంచి ఉపసంహరించి రాష్ట్రస్థాయిలో దర్యాఫ్తు చేస్తోందట.

English summary
'documents show how the CBI buried Mining cases against the #ReddyBrothers & the Goa angle- one of the reasons cited is that it "was impossible to segregrate the date" of iron ore from & Karnataka & Goa when investigating illegal ore exported via Mormugao & Panaji ports' Barkha Dutt tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X