వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బర్రకుడా': భారత్ ఎగుమతి చేయనున్న తొలి యుద్ధ నౌక

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: "బర్రుకుడా" భారత్ సొంతంగా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న యుద్ధ నౌక. 75 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుండే ఈ షిప్ లో ఒకేసారి 20 మంది నావికులు ప్రయాణించవచ్చు.

కోల్ కతాలోని గార్డెన్ షిప్ బిల్డర్స్ రూ.350 కోట్ల వ్యయంతో తయారు చేసిన యుద్ధ నౌక 'బర్రకుడా' మరో 10 రోజుల్లో మారిషస్ కు ఎగుమతి కానుంది. దీనితో పాటు రాబోయే రోజుల్లో గోవా షిప్ యార్డ్‌లో నిర్మాణంలో ఉన్న మరో రెండు నౌకలు త్వరలో శ్రీలంకకు ఎగుమతి కానున్నాయి.

Barracuda, the Kolkata-built warship to be the first export by India

ఈ యుద్ధ నౌకను మారిషస్ పోలీసులు తమ పరిధిలోని సముద్ర జలాల్లో అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఫిషింగ్ నిఘా నిమిత్తం వాడనుంది. చిన్న యుద్ధ నౌక అయినప్పటికీ తొలిసారిగా ఇండియా నుంచి ఎగుమతి కానుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

బర్రకుడా యుద్ధ నౌకకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయిల్ చిందడాన్ని అదుపు చేస్తుంది. ఈ యుద్ధ నౌకను మారిషస్‌కు అందించడం ద్వారా భారత్-మారిషస్ మధ్య సంబంధాలు మరింతగా బలోపేతం అవనున్నాయి. దక్షణ-పడమర భారత సముద్రంలో చైనా ఎత్తుగడలను నిలుపుదల చేయడంలో ఈ యుద్ధ నౌక తోడ్పడనుంది.

English summary
Barracuda, the coast guard ship will be the first warship export by India. A 75 ft by 15 ft vessel, the vessel can house 20 sailors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X