వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక సీఎంగా బసవరాజ బొమ్మై-త్వరలో కేబినెట్ విస్తరణ-ముగ్గురు డిప్యూటీ సీఎంలు

|
Google Oneindia TeluguNews

కర్నాటక ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత బసవరాజ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు రాజ్ భవన్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కర్నాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో బొమ్మై కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నా రు.

ఇప్పటివరకూ కర్నాటక హోంమంత్రిగా ఉన్న బసవరాజ బొమ్మైను యడ్యూరప్ప స్ధానంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో యడ్యూరప్ప సామాజిక వర్గం లింగాయత్ లకే చెందిన బొమ్మై ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బొమ్మై .. త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. యడ్యూరప్ప స్ధానంలో ముఖ్యమంత్రి అయిన బొమ్మై కు పలు సవాళ్లు తప్పేలా లేవు.

basavaraj bommai taken oath as karnatakas 23rd chief minister, chance for three deputy cms

మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆశీస్సులు కూడా ఉన్న బొమ్మై .. తన మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకుంటారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే కోవిడ్ సహాయక చర్యలపై దృష్టిసారిస్తానని ఇప్పటికే బొమ్మై ప్రకటించారు. తన కేబినెట్లో ముగ్గురు డిప్యూటీ సీఎంలను తీసుకునేందుకు బొమ్మై మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు వక్కళిగ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారిని డిప్యూటీ సీఎంలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

basavaraj bommai taken oath as karnatakas 23rd chief minister, chance for three deputy cms
English summary
basavaraj bommai has sworn in as karanataka's 23rd cheif minister today in bangalore after former cm yediyurappa's resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X