వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న కాకులు,కుక్కలు .. ఇప్పుడు గబ్బిలాలు ... గుట్టలుగా చనిపోతున్న వైనం ..టెన్షన్ లో జనం

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా కరోనా ప్రతాపం చూపుతుంది . కరోనా విజృంభిస్తున్న వేళ వివిధ రాష్ట్రాల్లో వింత పరిస్థితులు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. కొత్త భయాలు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి . ఇప్పటికే ఎక్కడ ఏం జరిగినా కరోనా వల్లనేనా అని భయపడుతున్న జనాలకు తాజాగా పలు చోట్ల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న కాకూ, కుక్కలు చనిపోతే కరోనా వల్ల అని తమిళనాడు జనం హడలిపోతే ఇప్పుడు గబ్బిలాలు గుట్టలుగా చనిపోతే అది కూదాకరోనా వల్లే అని భయపడుతున్నారు ఉత్తరప్రదేశ్ మీరట్ వాసులు .

యూపీలో గుట్టలుగా చనిపోతున్న గబ్బిలాలు

యూపీలో గుట్టలుగా చనిపోతున్న గబ్బిలాలు

చైనాలోని వుహ‌న్‌లో పుట్టిన క‌రోనా వైరస్ మొదట గ‌బ్బిలాల నుంచే మ‌నుషుల‌కు సంక్ర‌మించింద‌ని ప్ర‌చారం జరిగింది . ఇటువంటి త‌రుణంలో ఓ గ్రామ శివారులో గుట్ట‌లుగా గ‌బ్బిలాలు చ‌నిపోయిన సంఘటన అక్క‌డి స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. అటు వైపు వెళ్లేందుకు కూడా జ‌నం భ‌య‌ప‌డిపోతున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే మీర‌ట్‌లోని ఓ చెరువు స‌మీపంలో గ‌బ్బిలాలు కుప్పలుగా చనిపోయి ఉన్నాయి. అవి ఎందుకు చనిపోయాయో కారణం తెలియని వాళ్ళు అవి కరోనాతోనే చనిపోయాయని భయపడుతున్నారు.

గబ్బిలాల శాంపిల్స్ టెస్ట్ లకు పంపిన అధికారులు ... దర్యాప్తు

గబ్బిలాల శాంపిల్స్ టెస్ట్ లకు పంపిన అధికారులు ... దర్యాప్తు

దీంతో మీరట్ వాసులు ఆ చెరువు వైపు వెళ్లేందుకు కూడా ఎవ‌రూ సాహ‌సించ‌టం లేదు. చివ‌ర‌కు అధికారుల‌కు స‌మాచారం చేర‌టంతో అట‌వీ శాఖ అధికారులు, ప‌శువైద్యాధికారులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వాటి శాంపిల్స్ సేకరించి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చ‌నిపోయిన గ‌బ్బిలాల‌ల‌ను పోస్టుమార్టం కోసం త‌ర‌లించారు. ఇదిలా ఉంటే మీరట్‌లోని గంగానగర్‌లోని శివ్లోక్ కాలనీలో కొందరు కరోనాకు భయపడి గబ్బిలాలను నాటు తుపాకులతో కాల్చి చంపేస్తున్న‌ట్లు కూడా అధికారులు గుర్తించారు.గత మూడు రోజులుగా గబ్బిలాలు చనిపోతున్న ఘటనల నేపధ్యంలో ఏం జరుగుతునో అని భయపడుతున్నారు.

గ్రామానికి అరిష్టం అని, కరోనా వైరస్ తో చనిపోయాయని వదంతులు

గ్రామానికి అరిష్టం అని, కరోనా వైరస్ తో చనిపోయాయని వదంతులు

గ్రామానికి అరిష్టం అని, ఏదో కీడు జరుగుతుందని వారు వాపోతున్నారు . మ‌రోవైపు గ‌బ్బిలాల మృతిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఎవ‌రైనా వాటిని కావాల‌నే చంపేస్తున్నారా..? లేదంటే పొలాల్లో చ‌ల్లే పురుగు మందు కార‌ణంగా గ‌బ్బిలాలు చ‌నిపోయాయా...? అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు. లేదా వాటికి అన్నిటికీ ఏదైనా జబ్బు చేసిందా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టారు. కరోనా తీవ్రంగా ప్రబలుతున్న సమయంలో ఏ ఒక్క దాన్ని ఈజీగా వదలకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

తమిళనాడులోనూ కాకులు , కుక్కలు చనిపోతే స్థానికుల బెంబేలు

తమిళనాడులోనూ కాకులు , కుక్కలు చనిపోతే స్థానికుల బెంబేలు


ఇక మొన్నటికి మొన్న తమిళనాడులోని నాగపట్నం జిల్లా పూంపుహార్‌లో 150 కాకులు, మూడు కుక్కలు మృతి చెందాయి. ఒక్కసారిగా అంత పెద్ద సంఖ్యలో కాకులు , కుక్కలు చనిపోవటం కూడా వైరస్‌ వల్ల అన్న అనుమానంతో స్థానికులు భయపడిపోయారు. ఇక తాజాగా గబ్బిలాలు చనిపోతే కూడా కరోనా వైరస్ కు ముడి పెడుతున్నారు. ఇక దీంతో దేశంలో ఎక్కఫ్డ ఏం జరిగినా అధికార యంత్రాంగం అక్కడకు పరుగెత్తాల్సిన అవసరం ఏర్పడింది .

English summary
The incident in Meerut, in northern Uttar Pradesh, has died bats in a pond near Meerut. Those who do not know the reason why they died, fear that they died with corona. Few days ago 150 crows and three dogs died in Poompuhar, Nagapattinam district, in just one day. Locals feared that the virus was also causing the deaths of so many crows and dogs at once.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X