బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో వాలిపోయిన 5 అంతస్తుల పీజీ హాస్టల్, అద్దెల కోసం ఆరాటం, జీవితాలతో చెలగాటం, ఢమాల్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పరిదిలోని హెబ్బాళలోని కెంపాపుర ఓ పక్కకు వాలిపోయిన ఐదు అంతస్తుల పీజీ కట్టడం (పేయింగ్ గెస్ట్) కట్టడం నేలమట్టం చేసే పనిలో అధికారులు, సిబ్బంది నిమగ్నం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా 5 అంతస్తుల పీజీ కట్టడం ఉన్న పరిసర ప్రాంతాల్లోని 150 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అద్దె ఎక్కువ వస్తుందని ఆరాటంతో ఆత్రుగా కట్టడం నిర్మించారని, అద్దెకు ఉంటున్న ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని, అందుకే ఆ భవనం పక్కకు వాలిపోయిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

 ఉదయం వాలిపోయి 5 అంతస్తుల భవనం

ఉదయం వాలిపోయి 5 అంతస్తుల భవనం

బెంగళూరు నగరంలోని హెబ్బాళలోని కెంపాపురలోని జి. రామయ్య లేఔట్ లో నిర్మించిన 5 అంతస్తుల పీజీ కట్టడం ఉదయం వాలిపోయింది. పీజీలో నివాసం ఉంటున్న సుమారు 30 మంది ఉద్యోగులు విషయం తెలుసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగు తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే బీబీఎంపీ మేయర్ గౌతమ్ కుమార్, బీబీఎంపీ కమిషనర్ బీహెచ్. అనిల్ కుమార్, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

 చుట్టు పక్కల భవనాలకు హాని !

చుట్టు పక్కల భవనాలకు హాని !

పక్కకు వాలిపోయిన 5 అంతస్తుల పీజీ కట్టడం నేలమట్టం చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. చుట్టుపక్కల నిర్మించిన భవనాలకు హాని జరగకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐదు అంతస్తుల పీజీ భవనంలో నివాసం ఉంటున్న వారిని అందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

పునరావాస కేంద్రం

పునరావాస కేంద్రం

పక్కకు వాలిపోయిన 5 అంతస్తుల పీజీ భవనం చుట్టుపక్కల నివాసం ఉంటున్న సుమారు 150 మందిని పునారావాస కేంద్రం ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా అక్కడికి తరలించారు. పునరావాస కేంద్రంలో ఉన్న వారికి మూడుపూట ఆహారం అందిస్తున్నామని బీబీఎంపీ అధికారులు తెలిపారు.

 పక్కన 8 అడుగుల పునాది తీస్తే !

పక్కన 8 అడుగుల పునాది తీస్తే !

ఐదు అంతస్తుల పీజీ కట్టడం నిర్మించిన స్థలం పక్కనే మరో భవనం నిర్మించడానికి సుమారు 8 అడుగుల లోతులో పునాది తీశారని, అందుకే పక్కనే నిర్మించిన 5 అంతస్తుల భవనం పక్కకు వాలిపోయిందని బీబీఎంపీ ఇంజనీర్లు అంటున్నారు. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా పక్కన 8 అడుగుల గుంత తియ్యడానికి అనుమతి ఇచ్చిన బీబీఎంపీ అధికారులు ఎవరు ? అని ఆరా తియ్యాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భవనం నేలపట్టం చేస్తున్న సందర్బంగా పక్కన నివాసం ఉంటున్న వారు గ్యాస్ కనెక్షన్ లు వెంటనే తొలగించాలని బీబీఎంపీ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు స్థానికులకు మనవి చేశారు.

English summary
Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) has started demolishing the dangerously leaning structure in Hebbal, Kempapura. Officials have taken all safety measures to prevent any damage to neighbouring buildings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X