వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెటర్ల ట్వీట్ల వెనుక బీసీసీఐ కార్యదర్శి జయ్ షా?: ఎవరాయన?: రైతు ఉద్యమంపై మైండ్ గేమ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రైతులు సుదీర్ఘకాలంగా ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిని ముట్టడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది. బార్బేడియన్ నటి, గాయని రిహానా చేసిన ట్వీట్ తరువాత.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.

సెలెబ్రెటీలు ట్విట్టర్ ఎక్కడానికి కారణం..

ఆమె చేసిన ట్వీట్‌కు బాలీవుడ్ నటులు, క్రికెటర్లు వరుస బెట్టి స్పందిస్తున్నారు. రైతుల ఉద్యమం భారత అంతర్గత విషయమని, దీన్ని తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదంటూ బాలీవుడ్ సెలెబ్రిటీలు, క్రికెటర్లు రిహానాకు సమాధానమిస్తున్నారు. రిహానా చేసిన ఒక్క ట్వీట్.. రైతుల ఉద్యమంపై ఈ రెండు సినిమా, క్రీడారంగ ప్రముఖుల అభిప్రాయమేంటో వెల్లడించినట్టయింది. 70 రోజులకు పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి.. నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఏనాడూ పెద్దగా స్పందించని సెలెబ్రిటీలంతా.. ఇప్పుడు ఎకాఎకిన ట్వీట్లను వేయడం ప్రాధాన్యతను సంతరించకుంటోంది.

రిహానా ట్వీట్‌పై

రిహానా చేసిన ట్వీట్‌కు స్పందించిన క్రికెటర్ల జాబితా పెద్దదే. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కేప్టెన్ అజింక్య రహానె, మాజీ క్రికెటర్ సురేష్ రైనా, హెడ్ కోచ్ రవిశాస్త్రి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే రెస్పాండ్ అయ్యారు. రైతుల ఉద్యమం భారత అంతర్గత విషయమని తేల్చి చెప్పారు. బయటి వ్యక్తులు, శక్తులు.. ఇందులో జోక్యం చేసుకోవడాన్ని తాము స్వాగతించలేమని స్పష్టం చేశారు. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది భారత్‌కు తెలుసంటూ ట్వీట్లు చేశారు.

క్రికెటర్ల ట్వీట్ల వెనుక..

రాత్రికి రాత్రి వరుసబెట్టి క్రికెటర్లను ట్వీట్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇన్నాళ్లు లేని స్పందన.. ఇప్పుడెందుకు వచ్చిందంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దీని వెనుక భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జయ్ షా ప్రమేయం ఉందంటూ ఆరోపిస్తున్నారు. ఆయన జోక్యం చేసుకోవడం వల్లే క్రికెటర్లు మూకుమ్మడిగా స్పందిస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్లకు ఇష్టం లేకపోయినప్పటికీ.. వారిపై జయ్ షా ఒత్తిడిని తీసుకొస్తున్నారని విమర్శిస్తున్నారు. కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఎవరీ జయ్ షా..

జయ్ షా మరెవరో కాదు.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడే. 2019లో ఆయన బీసీసీఐ కార్యదర్శిగా నియమితులు అయ్యారు. తాజాగా మరో మెట్టు పైకి ఎక్కారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. జయ్ షా బీసీసీఐ కార్యదర్శిగా నియమితులైనప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. రాజకీయాలకు దూరంగా ఉండే క్రికెట్‌ను కూడా బీజేపీ నాయకులు కాషాయమయం చేస్తున్నారంటూ అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. జయ్ షా వాటిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన సారథ్యంలోనే గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఐపీఎల్ 2020 విజయవంతమైందనే వారు కూడా లేకపోలేదు.

English summary
Board of Cricket Control India (BCCI) Secretary Jay Shah allegedly behind the forcing cricketers from tweeting propaganda to back the Union government on the farmers protest row. Congress leader Karti Chidambaram requested to BCCI to stop forcing cricketers from tweeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X