వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొప్ప ప్రేమికుడిగా ఉండు: మతాంతర వివాహం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఓ మతాంతర వివాహం కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు వివాదాస్పద మతాంతర వివాహ కేసును బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. నీవు ఒక నమ్మకమైన భర్తగా, గొప్ప ప్రేమికుడిగా ఉండాలని పెద్దలు ఒప్పుకోని మతాంతర వివాహం చేసుకున్న యువకుడిని ఉద్దేశిస్తూ సుప్రీం వ్యాఖ్యానించింది.

మోహన్ భగవత్ కాన్వాయ్ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి, తాత పరిస్థితి విషమంమోహన్ భగవత్ కాన్వాయ్ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి, తాత పరిస్థితి విషమం

మతాలు వేరు..

మతాలు వేరు..

ఆ కేసు వివరాల్లోకి వెళితే.. ఓ హిందూ యువతి, అదే ప్రాంతానికి చెందిన ముస్లిం యువకుడిని ప్రేమించింది. అతడు కూడా ఆమెను ప్రేమించాడు. అబ్బాయి వేరే మతానికి చెందిన వాడు కావడంతో ఆమె కుటుంబసభ్యులు వారి వివాహానికి అంగీకరించలేదు.

మతం మార్చుకుని వివాహం..

మతం మార్చుకుని వివాహం..

ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యుల్లో నమ్మకాన్ని కలిగించడం కోసం ఆ యువకుడు హిందువుగా మారిపోయాడు. అనంతరం వివాహం చేసుకున్నాడు. అయినా కూడా యువతి కుటుంబసభ్యలు వారి వివాహాన్ని అంగీకరించలేదు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది.

కుల, మతాంతర వివాహాలను వ్యతిరేకించం కానీ..

కుల, మతాంతర వివాహాలను వ్యతిరేకించం కానీ..

ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసంన ఈ కేసును విచారించింది. యువకుడు మతం, పేరు మార్చుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నారా? అని కోర్టు విచారించింది. మేజర్లైన ఇద్దరు యువతీయుకుల ఆమోదంతో జరిగిన కులాంతర, మతాంతర వివాహాలను కోర్టు వ్యతిరేకించదని స్పష్టం చేసింది.

గొప్ప ప్రేమికుడిగా ఉండూ..

గొప్ప ప్రేమికుడిగా ఉండూ..

కేవలం అమ్మాయి భవిష్యత్ గురించి మాత్రమే కోర్టులు ఆలోచిస్తాయని తెలిపింది. అంతేగాక, ప్రేమించిన యువతి కోసం మతం మార్చుకోవడానికి సిద్ధపడ్డావు.. జీవితాంతం ఆమెకు గొప్ప ప్రేమికుడిగా, నమ్మకమైన భర్తగా ఉండాలని సుప్రీంకోర్టు సదరు యువకుడికి సూచించింది. కాగా, హిందూ అమ్మాయిలను మతం మార్చే రాకెట్ జరుగుతోందని యువతి తండ్రి కోర్టు దృష్టికి తీసుకెళ్లగా. అఫిడవిట్ సమర్పించాలని సూచించింది.

English summary
A controversial case of an inter-faith marriage from Chattisgarh was taken up for hearing in Supreme Court this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X