వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 కాదు 5 పీఎం : 1000 బస్సులు పంపడంపై ప్రియాంక గాంధీ యూపీ సర్కార్‌కు ప్రతీ లేఖ

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని సొంత రాష్ట్రం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ముందుకొచ్చారు. వెయ్యి బస్సులు పంపిస్తానని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాయగా.. అంగీకరించిన సంగతి తెలిసిందే.

దీంతో మధ్యాహ్నం 12 గంటలకు నోయిడాకు 500, ఘజియాబాద్‌కు 500 బస్సులను పంపించాలని యూపీ హోంశాఖ కార్యదర్శి ప్రియాంకగాంధీకి లేఖ రాశారు. దీనిపై ప్రియాంక కార్యదర్శి ప్రతీగ మరో లేఖ కూడా రాశారు. మీరు చెప్పిన చోటుకు బస్సులను పంపిస్తామని.. కానీ 12 గంటలకు వీలుకాదని.. సాయంత్రం 5 గంటలకు పంపిస్తామని పేర్కొన్నారు.

Be ready by 5 pm: Priyanka Gandhi says to UP govt for 1000 buses send

కచ్చితంగా 5 గంటలకు బస్సులు చేరుకుంటాయని.. ప్రయాణికుల జాబితా సిద్ధంగా ఉండాలని ప్రియాంక గాంధీ కోరారు. తమ బస్సు సిబ్బంది సమన్వయం చేసుకొని.. వలసకూలీలను తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. యూపీ ప్రభుత్వం మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోవాలని.. కోరగా ప్రియాంకగాంధీ మాత్రం మరింత సమయం కోరారు.

వలస కార్మికులను తరలించేందుకు వెయ్యి బస్సులు పంపిస్తానని ప్రియాంక గాంధీ కోరగా.. సోమవారం యోగి అంగీకరించిన సంగతి తెలిసిందే. తొలుత లక్నోకు బస్సులను పంపాలని ప్రభుత్వం కోరగా.. అక్కడ కంటే ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో కూలీలు ఎక్కువగా ఉన్నారు. అక్కడికి పంపిస్తే మేలు అని ప్రియాంక అభిప్రాయపడ్డారు. కానీ చివరికి ప్రభుత్వం మాత్రం నోయిడా, ఘజియాబాద్‌కు బస్సులను పంపించాలని తెలుపడంతో.. నిర్దేషిత సమయం కన్నా ఆలస్యంగా బస్సులను పంపిస్తున్నారు.

English summary
Congress leader Priyanka Gandhi has now written to the Uttar Pradesh Home Secretary the 1000 buses for migrant labourers will reach Noida and Ghaziabad borders by 5 pm on Tuesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X