వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీవోకేను వదులుకునేందుకు సిద్ధంగా ఉండాలి: పాక్‌కి సీఎం రూపానీ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

వడోదర: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. అంతేగాక, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ను వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పారు. భారత్ ఏక్తా మంచ్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, రెబల్ ఎమ్మెల్యేని కాపాడుతున్న గవర్నర్ ? రూ. 400 కోట్లు !రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం, రెబల్ ఎమ్మెల్యేని కాపాడుతున్న గవర్నర్ ? రూ. 400 కోట్లు !

'ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) కూడా మనదే. పీఓకేనే వదులుకునేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉండాలి. సమైక్య భారతావని కోసం తాము పీఓకేను కూడా సాధించి తీరుతాం. పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతు పలకడం మానుకోవాలి. దీన్ని భారత్ ఏ మాత్రం సహించదు' అని విజయ్ రూపానీ తేల్చి చెప్పారు.

‘Be ready to lose PoK’: Gujarat CM Vijay Rupani warns Pak

1971లో జరిగిన యుద్ధంలో పాక్ ఓడిపోవడంతో బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని
పాక్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గుర్తు చేశారు. 1971లో ఢిల్లీని ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నించిందని.. అయితే, అప్పుడు కరాచీని పోగొట్టుకునే పరిస్థితి ఆ దేశానికి వచ్చిందని ఎద్దేవా చేశారు.

పాక్ సైన్యం తమకు లొంగిపోయిందని గుజరాత్ ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కాగా, ఆగస్టు పార్లమెంటు సమావేశాల్లోనే జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. అంతేగాక, జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర ప్రాంతాలుగా విభజించారు. ఒకటి జమ్మూకాశ్మీర్ కాగా, మరొకటి లడక్.

English summary
Chief Minister Vijay Rupani on Sunday warned Pakistan to stop supporting terrorism and added that it should be ready to lose Pakistan-Occupied-Kashmir (PoK).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X