వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కన్నయ్య ప్యాంట్ తడిచేలా కొట్టాం‘: ఖలీద్ లొంగుబాటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పటియాలా హౌజ్ కోర్టులో హాజరుపర్చేందుకు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యను తీసుకురాగా, పోలీస్ కస్టడీలో ఉన్న అతనిపై ముగ్గురు లాయర్లు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ చెబుతున్న దృశ్యాలు వైరల్‌గా మారి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

‘కన్హయ్యను భారత్ మాతాకీ జై అనేదాకా కొట్టాం. కన్హయ్య ప్యాంట్ తడుపుకునేదాకా కొట్టాం' అని విక్రమ్ సింగ్, యశ్ పాల్, ఓం శర్మ పేర్కొన్నట్లు వెల్లడైంది. కోర్టు బయట జర్నలిస్టులు, జేఎన్‌యూ ప్రొఫెసర్లను కూడా కొట్టామని, ఇందుకు పోలీసులు కూడా సహకరించారని ‘ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించారు.

అంతేగాక, ఇక తీహార్ జైలులోకి వెళ్లి మరీ కన్హయ్యను చంపేస్తానని యశ్‌పాల్ హెచ్చరించారు. తదుపరి కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు పెట్రోల్ బాంబులు విసురుతానని కూడా చెప్పారు. జాతి వ్యతిరేక నినాదాలు చేసినవారెవ్వరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. కన్హయ్యను లాయర్లు చితకబాదినట్లు ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో తేలింది.

Beat Kanhaiya Kumar So Hard He 'Wet His Pants', Lawyers Purportedly Brag In Sting

జాతి వ్యతిరేకులకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేశామని, అప్పటికప్పుడు చోటుచేసుకున్నది కాదని ఇండియాటుడేకు చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించారు.

కాగా, వీడియోలో విక్రం చౌహాన్ (లాయర్) వెల్లడించి న ప్రకారం.. ‘మూడుగంటల పాటు కన్హయ్యను విపరీతంగా కొట్టాం. భారత్ మాతా కీ జై అనే వరకు కొట్టాం. దాంతో ఆయన ప్యాంటు తడిచింది' అని చెప్పాడు.

మరో లాయర్ యశ్‌పాల్‌సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘నా మీద హత్యకేసు నమోదు చేసిన పర్వాలేదు.. కానీ కన్హయ్యను వదిలే ప్రసక్తే లేదు. పెట్రోల్ బాంబు కూడా తీసుకెళ్తాను. ఈ కేసులో నన్ను అరెస్ట్ చేస్తే.. కన్హయ్య ఉండే జైలుకే వెళ్తాను. అతడు ఉండే గదికి వెళ్లి మళ్లీ కొడుతాను' అని తెలిపారు. దాడి చేయడానికి పోలీసులు మీకు సహకరించారా? అనే ప్రశ్నకు వారు అవును అని సమాధానమిచ్చారు.

Beat Kanhaiya Kumar So Hard He 'Wet His Pants', Lawyers Purportedly Brag In Sting

లొంగిపోయిన జేఎన్‌యూ విద్యార్థులు: కన్నయ్యపై విచారణ

జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించారు. రాజద్రోహం కేసులో నిందితుడిగా ఉన్న కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కుమార్‌కి బెయిల్‌ ఇవ్వాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, రెబక్కా జాన్‌, వృందా గ్రోవర్‌, సుశీల్‌ బజాజ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభారాణిని అభ్యర్థించారు.

ఢిల్లీ పోలీసుల తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బెయిల్‌ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ.. దర్యాప్తు స్థితిపై నివేదికను బుధవారం నాటికి కోర్టుకు సమర్పించాలని, ఆ తర్వాతే పిటిషన్‌పై ఓ నిర్ణయం తీసుకోగలనని స్పష్టం చేశారు.

కాగా, గతంలో కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ను అడ్డుకోబోమన్న ఢిల్లీ పోలీసు కమిషనర్‌ తాజా పరిణామాలపై స్పందిస్తూ.. పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా బెయిల్‌ పిటిషన్‌ను అడ్డుకున్నామని తెలిపారు. వర్సిటీలో ప్రత్యక్షమైన ఐదుగురు విద్యార్థులు పోలీసులకు సహకరించకపోతే తమదైన శైలిలో ప్రశ్నించేందుకు సిగ్గుపడబోమని బస్సీ వ్యాఖ్యానించారు.

మరోవైపు రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్‌ ఖలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్య మంగళవారం రాత్రి పోలీసులకు లొంగిపోయారు. పటియాల కోర్టు ఆవరణలో జేఎన్‌యూ అధ్యాపకులు, పాత్రికేయులపై దాడి చేస్తూ కెమెరాకు చి క్కిన లాయర్‌ యశ్‌పాల్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆ యన బెయిల్‌పై విడుదలయ్యారు.

English summary
In a sting operation aired by a news channel, three lawyers accused in last week’s court violence are heard bragging that they thrashed JNU student Kanhaiya Kumar for three hours while he was in police custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X