వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కోర్టులో దాడి చేశారు, బట్టలు ఊడదీసేంత పని చేశారు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో... ఢిల్లీ పోలీసుల సమక్షంలోనే తనన చితక్కొట్టారని, దాదాపుగా దుస్తులు ఊడదీసేంత పని చేశారని దేశద్రోహం నేరం కింద అరెస్టైన జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నేత కన్నయ్య కుమార్ ఆరోపించాడు.

కేసు నమోదు చేసిన తర్వాత అతడిని అరెస్ట్ చేసి పోలీసులు ఫిబ్రవరి 17వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు లాయర్ల ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో కొంతమంది లాయర్లు కావాలనే తనపై దాడికి పూనుకున్నారని కన్నయ్య కుమార్ సుప్రీం కోర్టుకు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

న్యాయమూర్తి సమక్షంలోనే తనపై దాడి చేసిన నిందితులను తాను కోర్టు హాలులోనే గుర్తించినా, వాళ్లను పోలీసులు అరెస్ట్ చేయలేదని కన్నయ్య కుమార్ అన్నాడు. తాను గేటువద్దకు రాగానే మీడియా తనను చుట్టుముట్టిందని, తర్వాత పోలీసులు లోపలకు తీసుకొచ్చారు.

Beaten, almost disrobed in presence of police in court premises, claims Kanhaiya

ఆ తర్వాత న్యాయవాది దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి తన వద్దకు వచ్చిదాడి చేశాడని, వచ్చేవాడే కన్నయ్య అంటూ బిగ్గరగా అరవగా.... మరికొందరు వచ్చి తనపై దాడి చేశారని అన్నాడు. తనపై దాడి చేసినవారిలో కొంతమంది పోలీసులు కూడా ఉన్నారని అతడు ఆరోపించాడు.

తనపై దాడిచేసిన వ్యక్తిని తాను కోర్టు గదిలో గుర్తించి, అతడిపై ఫిర్యాదు చేస్తానని చెప్పానని, అయితే పోలీసులు మాత్రం అందుకు స్పందించలేదని తెలిపాడు. ఆ తర్వాత తనను కూర్చో బెట్టి మంచీనీళ్లు ఇచ్చారన్నాడు. తనకు రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉందనే హైకోర్టు జడ్జికి చెప్పానని వివరించాడు.

మరోవైపు కన్నయ్య కుమార్‌పై దాడి చేసిన ముగ్గురు లాయర్లు కూడా దాడి చేసినట్లే ఒప్పుకున్నట్లు ఇంటర్నెట్‌లో వీడియోలు హల్‌చల్ చేశాయి. ‘కన్హయ్యను భారత్ మాతాకీ జై అనేదాకా కొట్టాం. కన్హయ్య ప్యాంట్ తడుపుకునేదాకా కొట్టాం' అని విక్రమ్ సింగ్, యశ్ పాల్, ఓం శర్మ పేర్కొన్నట్లు వెల్లడైంది.

కోర్టు బయట జర్నలిస్టులు, జేఎన్‌యూ ప్రొఫెసర్లను కూడా కొట్టామని, ఇందుకు పోలీసులు కూడా సహకరించారని ‘ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించారు. అంతేగాక, ఇక తీహార్ జైలులోకి వెళ్లి మరీ కన్హయ్యను చంపేస్తానని యశ్‌పాల్ హెచ్చరించారు.

తదుపరి కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు పెట్రోల్ బాంబులు విసురుతానని కూడా చెప్పారు. జాతి వ్యతిరేక నినాదాలు చేసినవారెవ్వరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. కన్హయ్యను లాయర్లు చితకబాదినట్లు ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో తేలింది.

English summary
It is the first statement of Kanhaiya on camera after Patiala House Court attack. Narrating the incident, Kanhaiya said, "The media ambushed me as soon as I reached the gate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X