వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమికుల రోజు స్పెషల్ : మా ప్రేమకు విలన్ ఆ యుద్ధమే: రతన్ టాటా లవ్ స్టోరీలో మలుపులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ratan Tata Reveals His Love Story On Valentine's Day

ఎప్పుడూ బిజీగా కనిపించే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా తన తీపి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఒక్కసారిగా రతన్ టాటా ఇంటర్నెట్ స్టార్ అయ్యారు. ఇంతకీ రతన్ టాటా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన ప్రేమ కథ ఏంటో తెలుసా..? ఆ ప్రేమకథకు విలన్ ఎవరో తెలుసా..? ఇవి తెలుసుకోవాలంటే లెట్స్ రీడ్ ది స్టోరీ...

అమ్మమ్మ నేర్పించని విలువలతోనే...

అమ్మమ్మ నేర్పించని విలువలతోనే...

ఎప్పుడూ వ్యాపారంతో బిజీగా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా జీవితంలో కూడా ఓ ప్రేమకథ ఉందన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. టాటా గ్రూప్ మాజీ ఛైర్మెన్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకప్పటి తన ప్రేమ కథ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఫేస్‌బుక్‌ పేజ్‌ హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో తన ప్రేమకథ గురించి చెప్పారు. తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితం ఎలా ప్రయాణించిందనే అంశాలను చెప్పారు. తల్లిదండ్రులు విడిపోయాక సుదీర్ఘకాలంగా తాను తన అమ్మమ్మ దగ్గర పెరిగినట్లు చెప్పిన రతన్‌టాటా, ఆమె తనకు ఎన్నో విలువలను నేర్పిందని నెమరువేసుకున్నారు.

తల్లిదండ్రులు విడిపోవడం బాధించింది

తల్లిదండ్రులు విడిపోవడం బాధించింది

రతన్ టాటా యవ్వనంలో చోటుచేసుకున్న పరిణామాలను కూడా పంచుకున్నారు. తన చిన్న తనం ఎంతో సాఫీగా సాగిందని చెప్పిన రతన్ టాటా.. తన సోదరుడితో పాటు తను పెరిగి పెద్ద వాళ్లుగా మారుతున్న సమయంలో తమ తల్లిదండ్రులు విడిపోవడం తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు రతన్ టాటా. ఈ రోజుల్లా కాకుండా అప్పట్లో విడాకులు తీసుకోవడమంటే చాలా పెద్ద విషయం. అంతేకాదు ఇప్పుడు చాలా సులభంగా దంపతులు విడిపోతున్నారని ఆ రోజుల్లో పెళ్లయిన దంపతులు విడిపోవాలంటే పెద్ద ప్రక్రియ ఉండేదని చెప్పారు.

 సుదీర్ఘ కాలంగా అమ్మమ్మ వద్దే..

సుదీర్ఘ కాలంగా అమ్మమ్మ వద్దే..

తల్లిదండ్రులు విడిపోవడంతో తన అమ్మమ్మ దగ్గరే పెరిగినట్లు చెప్పిన రతన్ టాటా... తన తల్లి మరో వివాహం చేసుకోవడంతో స్కూలులో తనను తోటి విద్యార్థులు హేళన చేసేవారని గుర్తుచేసుకున్నారు. తన గురించి ఎంతో చవకబారు వ్యాఖ్యలు చేసేవారని చెప్పారు. కానీ తన అమ్మమ్మ మాత్రం అవేమీ పట్టించుకోవద్దని మంచి క్రమశిక్షణతో ఉండాలని చెప్పేవారన్నారు. ఆమె నేర్పిన క్రమశిక్షణ అనే విలువ ఇప్పటికీ పాటిస్తానని చెప్పారు. ఈ విలువలే తనను అప్పటి పరిస్థితుల నుంచి దూరం ఉంచాయని చెప్పుకొచ్చారు.

అమ్మమ్మ నేర్పిన విలువలు క్రమశిక్షణ

అమ్మమ్మ నేర్పిన విలువలు క్రమశిక్షణ

క్రమశిక్షణకు, విలువలకు మారుపేరుగా నిలిచిన రతన్‌టాటా ఈ రోజు ఈ స్థాయిలో తను ఉన్నానంటే అది అమ్మమ్మ వేసిన బాటే అని గర్వంగా చెప్పుకున్నారు. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండేదని ఆ సమయంలో అమ్మమ్మ తన సోదరుడిని, తనను వేసవి సెలవులకు లండన్‌కు తీసుకెళ్లిందని గుర్తుచేసుకున్నారు. అక్కడే అమ్మమ్మ నేర్పిన విలువలకు అసలు అర్థం తెలిసిందన్నారు. ఆ విలువలు ఇప్పటికీ తమ మెదడులో నిక్షిప్తమై ఉన్నాయన్నారు. ఇక తన ప్రేమకథను కూడా ఈ సందర్భంగా రతన్‌టాటా పంచుకున్నారు.

లాస్‌ఏంజెలెస్‌లో తొలి ఉద్యోగం.. అక్కడే ప్రేమ

లాస్‌ఏంజెలెస్‌లో తొలి ఉద్యోగం.. అక్కడే ప్రేమ

కాలేజీ చదువులు పూర్తయ్యాక తాను లాస్‌ఏంజిలెస్‌లో ఒక ఆర్కిటెక్చర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లు రతన్ టాటా చెప్పారు. అక్కడే రెండేళ్ల పాటు పనిచేసినట్లు చెప్పారు. ఆ రోజులు చాలా బాగుండేవన్న రతన్ టాటా... అక్కడి వాతావరణం అద్భుతంగా ఉండేదని, తనకంటూ ఒక సొంతకారు ఉండేదని చెప్పారు. తన ఉద్యోగంను ఎంతో ప్రేమించినట్లు చెప్పారు. ఇక లాస్‌ఏంజిలెస్‌లోనే తను ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని గుర్తు చేసుకున్నారు బిజినెస్ టైకూన్. అదే సమయంలో తన అమ్మమ్మకు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తనను పరామర్శించేందుకు భారత్‌కు వచ్చినట్లు చెప్పారు.

 1962 ఇండో చైనా యుద్దంతో విడిపోయిన రతన్‌టాటా కపుల్

1962 ఇండో చైనా యుద్దంతో విడిపోయిన రతన్‌టాటా కపుల్

తను ప్రేమించిన అమ్మాయి కూడా తనతో పాటే భారత్‌కు వస్తుందని భావించినట్లు చెప్పారు రతన్ టాటా. ఇక తమ ప్రేమ పెళ్లి వరకు చేరుకుందని చెప్పిన రతన్ టాటా... అన్ని ప్రేమకథలకు ఒక విలన్ ఉన్నట్లుగా తమ ప్రేమకథలో కూడా విలన్ ఉన్నట్లు చెప్పారు. అయితే విలన్ ఒక వ్యక్తికాదని చెప్పారు. అదో యుద్ధం అని చెప్పగానే అంతా షాక్ అయ్యారు. యుద్ధం ఈ ప్రేమపక్షులను విడదీసిందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. 1962లో భారత్ చైనాల మధ్య యుద్ధం జరగడంతో తను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భారత్‌కు పంపేందుకు నిరాకరించారని చెప్పారు. ఓవైపు అమ్మమ్మ మరోవైపు ప్రేమించిన అమ్మాయి... ఇలా ఇద్దరినీ వదులుకోవడం ఇష్టం లేదని చెప్పిన రతన్ టాటా... జీవితంలో విలువలను నేర్పిన తన అమ్మమ్మే ముఖ్యమని భావించి తను ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నట్లు చెబుతూ ఒక్కింత భావోద్వేగానికి గురయ్యారు.

English summary
Social media's favourite Ratan Tata is breaking the internet as he recently opened up about his love life and the fact that he almost got married. The former Tata group chairman spoke to Humans of Bombay and also shared about life after his parents' divorce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X