వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మళ్లీ సీఎం చేశారు! దిగ్విజయ్‌ అసమర్థతకు కృతజ్ఞతలు! ’: పారికర్ చురకలు

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌కు రాజ్యసభలో వ్యంగ్యోక్తులతో చురకలంటించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో భారతీయ జనతా పార్టీ .

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌కు రాజ్యసభలో వ్యంగ్యోక్తులతో చురకలంటించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో భారతీయ జనతా పార్టీ కన్నా కాంగ్రెస్‌కు అధిక స్థానాలు లభించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన విషయం తెలిసిందే.

డిగ్గీకి చురక

డిగ్గీకి చురక

కాగా, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి గోవాలో సంకీర్ణ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఇదే విషయాన్ని పారికర్‌ శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావిస్తూ గోవాలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న దిగ్విజయ్‌ అసమర్థత వల్లే తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగామంటూ చురకవేశారు.

రాజ్యసభ సభ్యత్వానికి వీడ్కోలు..

రాజ్యసభ సభ్యత్వానికి వీడ్కోలు..

రాజ్యసభ సభ్యుడు అయిన పారికర్‌ కేంద్ర రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. పారికర్‌ శుక్రవారం రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు సభకు వచ్చారు.

దిగ్విజయ్ వల్లే..

దిగ్విజయ్ వల్లే..

ఈ సమయంలో దిగ్విజయ్‌ సింగ్‌, మరికొందరు కాంగ్రెస్‌ సభ్యులు గోవాలో అనైతిక మార్గాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ పారికర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విమర్శలను పారికర్‌ తోసిపుచ్చుతూ.. దిగ్విజయ్ అసమర్థత వల్లే తాను మళ్లీ సీఎంను అయ్యానంటూ ఎద్దేవా చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులంతా పోడియం వద్దకు వచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

గోవాకు స్వాగతం..

గోవాకు స్వాగతం..

సభలో సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపిన పారికర్.. గోవాకు అందరినీ స్వాగతించారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు అందరూ తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తనకు ెంతగానో సహకరించారని, వాళ్లంతా ఎప్పుడు గోవా రావాలనుకున్నా అందరికీ స్వాగతమని అన్నారు.

English summary
Goa Chief Minister Manohar Parrikar on Friday took a jibe at Congress party leader Digvijaya Singh in Rajya Sabha and said that the Congress party leader was roaming in the state after elections, BJP formed the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X