వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో తొలిరాత్రి: నల్లులు, దోమలమధ్య లాలూకి నిద్రలేమి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bed Bugs give Lalu a sleepless night in jail
రాంచీ: దాణా కుంభకోణం కేసులో దోషి అయిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు జైలులో తొలి రాత్రి చాలా కష్టంగా గడిచింది. రాంచీలోని బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఆయన నిద్రలేని రాత్రి గడిపారు. సోమవారం రాత్రి ఆయన నిద్రించలేకపోయారు. విఐపి కావడంతో దోమతెర అందుబాటులో ఉన్నప్పటికీ దానివల్ల పెద్దగా లాభం లేకపోయింది. ఈ మేరకు జాతీయ మీడియాలో బుధవారం వార్తలు వచ్చాయి.

మంగళవారం ఉదయం 7 గంటలకు లేచిన లాలూ జైలు క్యాంపస్‌లో అప్పర్ డివిజన్‌లో కాస్తా అటూ ఇటూ తిరిగారు. తన సెల్ దుస్థితిపై ఆయన జైలు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. సెల్‌లో ఫ్యాన్ ఉన్నప్పటికీ ఎయిర్ కూలర్ లేదు. నల్లుల సమస్యను తాము త్వరలోనే పరిష్కరిస్తామని జైలు అధికారులు అంటున్నారు.

కామన్ హాల్‌లో వార్తాపత్రికలు చదివారు. సహ ఖైదీలతో ముచ్చట పెట్టారు. జైలు అధికారులు ఇచ్చిన దుస్తులు కాకుండా తాను పైజామా, కుర్తా ధరించారు. టీవీ చూస్తూ టీకి ఆర్డర్ చేశాడట. లాలూకు సహాయం చేయడానికి ఇద్దరు ఖైదీలను నియోగించారు. ఆ తర్వాత ఆయన తన మద్దతుదారులను కలిశారు.

కామన్ హాల్‌లోకి తెచ్చిపెడితే ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం చేశారు. జైలు మాన్యువల్ ప్రకారం - లాలూకు 350 గ్రాముల అన్నం, 117 గ్రాముల పప్పులు, 233 గ్రాముల కూరగాయలు, 233 గ్రాముల పొటాటోలు, 467 గ్రాముల పెరుగు లేదా పాలు, 29 గ్రాముల నెయ్యి, రోజుకు 2 ఫలాలు అందుబాటులో ఉంటాయి.

English summary
According to media reports - Mosquitoes and bedbugs gave Rashtriya Janata Dal (RJD) president Lalu Prasad a sleepless night at Ranchi's Birsa Munda central jail, where he was lodged after his conviction in the fodder scam on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X