• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bed Scam: పరుపుల బిజినెస్, పడుకుంటే రూ. లక్ష, నిన్న ఆంటీ, నేడు త్రిమూర్తులు, డీలింగ్ !

|

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో డబ్బులు ఎలా సంపాధించాలో అనే అతి తెలివి స్కెచ్ లతో మరోసారి బెంగళూరులో మరో ముగ్గురు అరెస్టు అయ్యారు. డబ్బులు సంపాధించడానికి వేరే మార్గాలు ఉన్నా కోవిడ్ రోగును టార్గెట్ చేసుకుని పరుపుల బిజినెస్ చేస్తూ ఇప్పటికే సమాజసేవకురాలి ముసుగులో తిరుగుతున్న నేత్రావతి ఆంటీ అరెస్టు అయ్యింది. ఇప్పుడు మహిళకు ఐసీయూలో బెడ్ ఇప్పించడానికి ఏకంగా లక్షలు వసూలు చేసిన మరో ముగ్గురు కాలాంతకులను పోలీసులు అరెస్టు చేశారు. లక్షలు ఇచ్చినా ఆ మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో పరుపుల దందా ముఠా సభ్యులు పోలీసులకు చిక్కిపోయారు.

Bed Blocking: కిలాడి నేత్రావతి అందర్, ఒక్క బెడ్ రూ. 50 వేలు, ఆంటీ డీల్, ఎంపీ ఎంట్రీతో ?Bed Blocking: కిలాడి నేత్రావతి అందర్, ఒక్క బెడ్ రూ. 50 వేలు, ఆంటీ డీల్, ఎంపీ ఎంట్రీతో ?

 ఐటీ హబల్ లో కరోనా భరతనాట్యం

ఐటీ హబల్ లో కరోనా భరతనాట్యం

ఐటీ హబ్ దేశ రాజధాని బెంగళూరులో కరోనా వైరస్ మహమ్మారి భరతనాట్యం చేస్తోంది. ఎవరికి ఎప్పుడు కరోనా పాజిటివ్ అని వెలుగు చూస్తుందో అర్థం కాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరుతో పాటు కర్ణాటక మొత్తం లాక్ డౌన్ అమలులో ఉన్నా కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు కావడం కలకలం రేపుతోంది.

 బెడ్ బ్లాకింగ్ స్కామ్

బెడ్ బ్లాకింగ్ స్కామ్

రెండు రోజుల క్రితం బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యా ఎంట్రీ ఇవ్వడంతో బెంగళూరులో కోవిడ్ పాజిటివ్ రోగుల కోసం రిజర్వ్ చేసిన బెడ్ లు ఎలా బ్లాక్ లో విక్రయిస్తున్నారో అనే విషయం వెలుగు చూసింది. సమాజ సేవకురాలి ముసుగులో కోవిడ్ రోగులను టార్గెట్ చేసుకుని ఒక్కొక్క బెడ్ రూ. 50 వేలుకు విక్రయిస్తున్న నేత్రావతి అలియాస్ నేత్రా, ఆమె మనుచరుడు పోలీసులకు పట్టుబడ్డారు.

 మహిళ పరిస్థితి విషమం

మహిళ పరిస్థితి విషమం

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని నెలమంగలకు చెందిన లక్ష్మిదేవి అనే మహిళకు కోవిడ్ పాజిటివ్ అని వెలుగు చూసింది. నెలమంగలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లక్ష్మిదేవికి చికిత్స అందించారు. అనంతరం లక్ష్మిదేవిని బెంగళూరులోని యశవంతపురంలోని పీపుల్ ట్రీ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించారు. అయితే లక్ష్మిదేవి పరిస్థితి విషమంగా మారింది.

 ఐసీయూ బెడ్ కావాలి

ఐసీయూ బెడ్ కావాలి

పీపుల్స్ ట్రీ ఆసుపత్రిలో వెంటిలేటర్, ఐసీయూ బెడ్ లు లేకపోవడం, అక్కడి సిబ్బంది సూచనలతో లక్ష్మిదేవి కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఎంఎస్. రామయ్య ఆసుపత్రిలోని సిబ్బందిని సంప్రధించారు. ఆసుపత్రిలోకి వెంకటసుబ్బారావ్, మంజునాథ్ అనే ఇద్దరు ఎంఎస్. రామయ్య ఆసుపత్రిలోని ఆరోగ్య మిత్రా విభాగంలో పని చేస్తున్న పునీత్ అనే వ్యక్తిని సంప్రధించాలని సూచించారు.

 ఐసీయూ బెడ్ డీలింగ్ రూ. 1. 20 లక్షలు

ఐసీయూ బెడ్ డీలింగ్ రూ. 1. 20 లక్షలు

ఎంఎస్. రామయ్య ఆసుపత్రిలో మీకు ఐసీయూ బెడ్ కావాలన్నా, ఆ బెడ్ మీద మీరు పడుకుని చికిత్స చేసుకోవాలంటే రూ. 1.20 లక్షలు ఇవ్వాలని పునీత్ లక్ష్మిదేవి కుటుంబ సభ్యులకు చెప్పాడు. గూగుల్ పే ద్వారా రూ. 50 వేలు, నేరుగా క్వాష్ రూపంలో మరో రూ. 70 వేలు చెల్లించిన కుటుంబ సభ్యులు లక్ష్మిదేవిని ఎంఎస్. రామయ్య ఆసుపత్రిలో చేర్పించి ఆమె ప్రాణాలు కాపాడటం కోసం ప్రయత్నించారు.

 కొన్ని గంటల్లోనే ప్రాణం పోయింది

కొన్ని గంటల్లోనే ప్రాణం పోయింది

రూ. 1. 20 లక్షలు లంచం ఇచ్చి ఐసీయూలో చేర్పించిన కొన్ని గంటల్లోనే లక్ష్మిదేవి ప్రాణాలు పోయాయి. డబ్బుల కోసం ఇంతగా పీడించి వసూలు చేసకున్నా లక్ష్మిదేవి ప్రాణాలు పోవడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో ఒక్కరైన చేతన్ బెంగళూరు పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి పరుపుల దందా స్కామ్ విషయంలో పూర్తి సమాచారం ఇచ్చారు.

 పరుపుల బిజినెస్ దందాలో ?

పరుపుల బిజినెస్ దందాలో ?

కేసు నమోదు చేసిన బెంగళూరులోని సదాశివనగర పోలీసులు మహిళకు బ్లాక్ లో ఐసీయూ బెడ్ ను రూ. 1.20 లక్షలకు విక్రయించిన పునీత్, సుబ్బారావ్, మంజునాథ్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు ఇంకా ఎంత మంది కోవిడ్ రోగులకు ఇలా బ్లాక్ లో ఐసీయూ బెడ్ లు విక్రయించారు ? అంటూ బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
Bed Scam: Sadashivanagara police have arrested three accused in the connection of ICU bed dealing case in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X