వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఫ్ తిన్నందుకే బోల్ట్‌కు గోల్డ్ మెడల్స్: ట్విట్టర్‌లో ఎంపీ వివరణ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీఫ్ తిన్నందుకే జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఒలింపిక్స్‌లో 9 బంగారు పతకాలను గెలిచాడని ఆదివారం బీజేపీకి చెందిన ఎంపీ ఉదిత్ రాజ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆయన తిరిగి సోమవారం ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు.

ఒలింపిక్స్‌లో మెడ‌ల్ గెల‌వ‌డానికి ఉన్న మార్గాలు అన్వేషించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆయ‌న తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే... చిన్నప్పటి నుంచి పేదరికం, సరైన వసతులు లేకపోయినా బోల్ట్ వాటిని అధిగమించి ఒలింపిక్స్‌లో 9 బంగారు పతకాలు సాధించాడని ట్వీట్ చేశారు.

Beef Helped Usain Bolt to Win 9 Gold Medals in Olympic, Says BJP MP Udit Raj

బోల్ట్ విజయాల వెనకున్న సీక్రెట్ ఇదేనని, అతని ట్రైనర్ సైతం రెండుపూటలా బీఫ్ తినమని చెప్పినందుకే ఇది సాధ్య‌మైంద‌ని మొద‌ట ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగింది. దీంతో ఆయ‌న వెంట‌నే మ‌రో ట్వీట్ చేశారు. త‌న వ్యాఖ్య‌లు బీఫ్ తిన‌డాన్ని ప్రోత్స‌హించిన‌ట్లు ఉన్నాయ‌న్న వాద‌న 200 శాతం త‌ప్ప‌ని అన్నారు.

ప్ర‌స్తుతం మన దేశంలో గోవ‌ధ‌పై ఉన్న సున్నిత‌మైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీఫ్ తిన్నంత మాత్రాన పతకాలు రావ‌ని, స‌రైన వ‌స‌తులు క‌ల్పిస్తేనే పతకాలు సాధ్యమవుతాని నెటిజన్లు ట్విట్టర్‌లో ఎంపీలకు సలహా ఇచ్చారు.

English summary
A day after he tweeted that a beef diet helped Jamaican sprinter Usain Bolt win nine gold medals in the Olympics, Dalit activist and Bharatiya Janata Party (BJP) Lok Sabha member Udit Raj clarified on Monday that he was referring to his "dedication".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X