వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలకు ముందు మోడీ తాయిలం .. అస్సాంలో ఇళ్ళ పట్టాల పంపిణీ చేసిన ప్రధాని

|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంలో పేదలకు భూ పట్టాలను పంపిణీ చేశారు .ఈ సంవత్సరం అస్సాం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలపై దృష్టి సారించిన నరేంద్ర మోడీ అస్సాం వాసులకు ఇప్పటి నుంచే తాయిలాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా వీరికి భూమి పట్టాల పంపిణీ జరగలేదని పేర్కొన్న నరేంద్ర మోడీ, లక్షలాదిమంది అస్సాం వాసులకు ఇంకా భూ పట్టాల పంపిణీ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు.

 మమతా బెనర్జీకి షాకిచ్చిన మరో టీఎంసీ నేత ... అటవీశాఖా మంత్రి రాజీబ్ బెనర్జీ రాజీనామా మమతా బెనర్జీకి షాకిచ్చిన మరో టీఎంసీ నేత ... అటవీశాఖా మంత్రి రాజీబ్ బెనర్జీ రాజీనామా

ఈ ఏడాది ఎన్నికలకు ముందే అస్సాం వాసులను ప్రసన్నం చేసుకోవటంలో భాగంగా అస్సాంలోని ప్రజలకు భూ కేటాయింపు పత్రాలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పంపిణీ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ స్వదేశీ ప్రజల భూమి, భాష, సంస్కృతిని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నారని మోడీ అన్నారు. లక్షలాది కుటుంబాలకు యాజమాన్య ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి డ్రైవ్ ప్రారంభించిన మోడీ రాష్ట్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలు తమ భూములపై ​​చట్టబద్దమైన హక్కులు ఉండేలా కట్టుబడి ఉంది అని మోడీ అన్నారు.

Before elections PM Modi Distributes Land Papers to Assams Indigenous Families

భూముల పట్టాల పంపిణీ ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఇక్కడి చారిత్రాత్మక 'జెరెంగా పాథర్' వద్ద 10 మందికి 'పట్టాలు' పంపిణీ చేశారు. సర్బానంద సోనోవాల్ ప్రభుత్వం అస్సాంలో పగ్గాలు చేపట్టినప్పుడు, ఆరు లక్షలకు పైగా స్వదేశీ కుటుంబాలకు వారి భూమిపై చట్టపరమైన హక్కులు లేవు. గత కొన్నేళ్లలో అలాంటి రెండు లక్షలకు పైగా కుటుంబాలకు యాజమాన్య ధృవీకరణ పత్రాలు కేటాయించబడ్డాయి. ఈ రోజు మరికొన్ని కుటుంబాలకు భూముల పట్టాలను ఇచ్చామని, స్థానిక ప్రజల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం తన నిబద్ధతను చూపించింది అని మోడీ అన్నారు.

ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి.. సురభి పిక్స్ వైరల్

అస్సాంలోని గత ప్రభుత్వాలు ఈ పవిత్ర భూమిని ప్రేమించే వారి హక్కులను ఎప్పుడూ పట్టించుకోలేదు అని మోడీ విమర్శించారు . యాజమాన్య ధృవీకరణ పత్రాలు వారి 'స్వాభిమాన్' , స్వాధీనతా , సురక్ష కు హామీ ఇస్తాయి అని ఆయన చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత కాజీరంగ జాతీయ ఉద్యానవనాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడినందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

English summary
Prime Minister Narendra Modi on Saturday distributed land allotment papers to people in Assam, ahead of the elections this year. Modi said Assam Chief Minister Sarbananda Sonowal was committed to protecting the land, language and culture of indigenous people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X