వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాచకురాలే... సినిమా సింగర్..! రైల్వే ప్లాట్ ఫాం టాలెంట్ గుర్తించిన శంకర్ మహదేవన్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా/ముంబై : ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో తెలియదు. ఎవరీ జీవితం ఏ మలుపు తిరుగుతుందో అంచనా వేయలేం. సినిమాలు, రాజకీయాల్లో వాడే బండ్లు ఓడలు, ఓడలు బండ్లు సామెత .. సాధారణ ప్రజలకు కూడా వర్తిస్తోంది. ప్రతిభ ఉండాలే గానీ ప్రోత్సహించే వారికి కొదవలేదు. మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా గాయకులకు ఇదీ వందశాతం వర్తిస్తోంది. మంచి స్వరం, టైమింగ్‌తో పాటలు పాడితే చాలు .. అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. బెంగాల్‌కు చెందిన ఓ యాచకురాలి జీవితంలో ఇలాంటి ఘటనే జరిగింది.

ప్లాట్ ఫాం నుంచి స్టూడియోలోకి ..

ప్లాట్ ఫాం నుంచి స్టూడియోలోకి ..

పక్క ఫోటోలో కనిపిస్తోన్నది ఒక్కరే. అవును మీరు వింటున్నది నిజమే. అందులో కనిపిస్తోన్న మహిళ నేపథ్య గాయనీకి ముందు నేపథ్య గాయనీ తర్వాత ఫోటోలు. విషయానికొస్తే .. పశ్చిమబెంగాల్‌లోని రాణఘాట్ రైల్వే ఫ్లాట్‌ఫాంలో ఓ యాచకురాలు పాటలు పడుతుంది. అచ్చం నేపథ్య గాయనీ మాదిరిలా పాటలు పడటంతో అటుగా వెళ్లేవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె గొంతునుంచి వస్తోన్న మధురగానం విని అందరూ పులకించిపోయారు. కానీ ఒకరు ఆమె ప్రతిభను వెలికితీయాలని భావించారు. ఆమెతో పాటలు పాడించి వీడియో తీశారు. రెండు అర పాటలు వీడియో తీసి .. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది నెటిజన్లు ఆమె ప్రతిభపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆ వీడియో అలా అలా సినీ ప్రముఖుల వద్దకు కూడా చేరింది.

ఆశ్చర్యపోయిన శంకర్ మహదేవన్

ఆమె పాడిన పాటను విని ప్రముఖ నేపథ్య గాయకుడు శంకర్ మహదేవన్ ఆశ్చర్యపోయారు. ఓ మధుర గానం రైల్వే ప్లాట్ ఫాం ఉంటుందా అని చలించిపోయారు. ఆ వీడియో ఆధారంగా ఆమె ఆచూకీ కనుగొన్నారు. ఆమెను పిలిచి మాట్లాడారు. బాలీవుడ్‌లో పాటలు పాడే అవకాశం కల్పించారు. దీంతో యాచకురాలు కాస్త గాయనిగా మారిపోయారు. నేపథ్య గాయనీ అంటే మాములు విషయం కాదు కదా .. అందుకే ఆమె ఇలా మోడ్రన్‌గా మారిపోయారు. అంతేందుకు రాణఘాట్ ఫ్లాట్ ఫాం మీద చూసినవారే ఆమెను చూసి నమ్మలేకపోతున్నారు. అవునా నిజంగా .. ఇలా మారిపోయారా అంటూ ఆశ్చర్యపడుతున్నారు. మరికొందరు ఆమె ప్రతిభకు తగిన ప్రోత్సాహం లభించిందని అంటున్నారు.

మరవను మీ మేలు

మరవను మీ మేలు

తనకు లభించిన అవకాశంపై యాచకురాలు ఉబ్బితబ్బవుతున్నారు. అంతేకాదు తాను కూడా నమ్మలేకపోతున్నానని చెప్తున్నారు. ఎక్కడో ఉన్న తనను పిలిచి అవకాశం ఇచ్చిన శంకర్ మహాదేవన్ దేవుడంటూ ప్రశంసిస్తున్నారు. తన జీవితం మారేందుకు శంకర్ సారే కారణమని తెలిపారు. దీంతోపాటు వీడియో తీసి పోస్ట్ చేసిన యువకుడు .. వాటిని షేర్ చేసిన వారికి కూడా రుణపడి ఉంటానన్నారు. వారందరి సహకారం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని పేర్కొన్నారు. తన జీవితం కొత్త పుంతలు తొక్కడానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యావాదాలు తెలిపారు.

English summary
This beggar used to sing on the railway platform of Ranaghat in West Bengal. After her video became viral, Shankar Mahadevan took her to Bollywood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X