• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంతానికి ఆరంభం?: ఉప ఎన్నికల్లో బోల్తా పడుతున్న బీజేపీ.. 23లో గెలిచింది నాలుగే!

By Ramesh Babu
|
  ఉప ఎన్నికల్లో బీజేపీ బోల్తా.... 23లో గెలిచింది నాలుగే!

  న్యూఢిల్లీ: 2014 సాధారణ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ తరువాత జరిగిన ఊప ఎన్నికల్లో మాత్రం చతికిలపడుతూ వస్తోంది. 1984 తర్వాత తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వ అవసరం లేకుండా బీజేపీకే 282 సీట్లు వచ్చాయి. దీంతో ఏ పార్టీతోనూ ఎలాంటి పొత్తు లేకుండా ఆ పార్టీ ఒక్కటే కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.

  అయితే అప్పటి నుంచి జరుగుతూ వస్తున్న ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ పరిస్థితి తారుమారవుతోంది. ఈ నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 23 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. అందులో బీజేపీ గెలిచింది కేవలం నాలుగు స్థానాలే కావడం గమనార్హం. ఇది ప్రతిపక్షాలకు మరింత ఊతమిస్తోంది.

  మరోవైపు క్రమంగా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించింది. వీటిలో అమృత్‌సర్‌ను నిలుపుకోగా.. మరో నాలుగు స్థానాలను బీజేపీ నుంచి లాక్కుంది. బీజేపీలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా నాలుగు స్థానాల్లో గెలిచింది.

  Beginning of the end: As BJP tastes defeat in Lok Sabha bypolls, Opposition leaders rejoice

  ఈ 23 స్థానాల్లో పది బీజేపీ చేతుల్లోనే ఉండేవి. కానీ వాటిలో నాలుగు మాత్రమే నిలుపుకోగా.. మిగతా ఆరింటిని కోల్పోయింది. ఒక్క స్థానాన్ని కూడా కొత్తగా గెలుచుకోలేకపోయిందంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నాలిగింట్లో రెండు 2014లో, మరో రెండు 2016లో గెలిచింది.

  2015లో మధ్యప్రదేశ్‌లోని రాట్లం స్థానాన్ని బీజేపీ కాంగ్రెస్‌కు కోల్పోయింది. అదే ఏడాది తెలంగాణలో వరంగల్ స్థానాన్ని టీఆరెస్, బెంగాల్‌లో బన్‌గావ్ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ నిలుపుకున్నాయి. 2016లో మాత్రం బీజేపీ కాస్త మెరుగైన ఫలితాలు సాధించింది. అస్సాంలోని లఖిమ్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని షాడోల్ స్థానాలను నిలుపుకోగలిగింది.

  2017లో రెండు ఉప ఎన్నికల్లో ఓడిపోయింది బీజేపీ. పంజాబ్‌లోని అమృత్‌సర్, గురుదాస్‌పూర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో బీజేపీ ఓడిపోయింది. కేరళలో మళప్పురం, జమ్ముకశ్మీర్‌లో శ్రీనగర్ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. 2018లో రెండు నెలల వ్యవధిలోనే నాలిగింట్లో ఓడింది.

  గతంలో బీజేపీ ఎంపీలు ఉన్న ఆరుస్థానాలకు ఉప ఎన్నికలు జరగగా... అందులో కేవలం రెండింట్లో గెలిచి మిగతా నాలుగు స్థానాలు కోల్పోయింది. ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని అజ్మీర్, అల్వార్ లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఓటమి తప్పలేదు. తాజాగా యూపీలో గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్‌ల రూపంలో రెండు కీలక స్థానాలను బీజేపీ కోల్పోయింది. బీహార్‌లోని అరారియాలో ఆర్జేడీ దూకుడును సైతం బీజేపీ అడ్డుకోలేకపోయింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  For the BJP, which dreams of recreating Modi's stunning rise to power in next year's general election, hasn't won a single Lok Sabha bypoll in 2018 or 2017.There have been six such elections this year - two in Rajasthan, one in West Bengal, one in Bihar, and two in Uttar Pradesh. All but one of them were held in NDA-governed states. Wednesday's losses must have hurt the most. The Gorakhpur and Phulpur seats in Uttar Pradesh, now represented by Samajwadi Party legislators, were vacated by Chief Minister Yogi Adityanath and one of his two deputies. The BJP's foes may exult now, but there are still many months - and many elections - to go before Indian voters are invited to hit the refresh button on their national legislature next year. And after all, can a few bypoll results have a bearing on state elections?
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more