ఒళ్ళు దగ్గర పెట్టుకోండి,లేకపోతే మీకే ప్రమాదం, గౌరవించాల్సిందే
న్యూఢిల్లీ :అమెజాన్ తీరు మార్చుకోకపోవడంతో భారత్ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హెచ్చరించిన తర్వాత కూడ ఆ సంస్థ తన తీరును మార్చుకోలేదు. మహత్ముడి బొమ్మను చెప్పులపై ముద్రించి విక్రయానికి పెట్టింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ చెప్పులను తన సైట్ నుండి ఆ సంస్థ తొలగించింది.
ఈ కామర్స్ జెయింట్ అమెజాన్ సంస్థ తీరు పట్ల భారతీయులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్. తన పద్దతులను మార్చుకోవాలని భారత్ తీవ్రంగా హెచ్చరించింది.
డోర్ మ్యాట్ లపై భారత జాతీయ పతాకాన్ని ముద్రించి అమ్మకానికి పెట్టింది ఆ సంస్థ.అయితే ఈ సంస్థ తీరు పట్ల భారత విదేశాంగ శాఖ మంత్రి సుస్మాస్వరాజ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే ఈ అభ్యంతరాలను పక్కన పెట్టింది ఆ సంస్థ, మహత్ముడి ఫోటోను చెప్పులపై ముద్రించి విక్రయానికి పెట్టడంతో నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరాలను వ్యక్తం చేశారు.ఈ ఘటనను నెటిజన్లు నిరసనలు వ్యక్తం చేశారు.

అమెజాన్ ను హెచ్చరించిన భారత్
దేశంలో అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ అమెజాన్. దేశంలో ఈ సంస్థ రెండో అతి పెద్ద ఈ కామర్స్ సంస్థ. ఈ సంస్థ అనుసరిస్తున్న విధానాలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.భారత్ గౌరవ చిహ్నల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ప్రమాదం కొనితెచ్చుకొన్నట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ హెచ్చరించారు.
దేశ చిహ్నలు, చిహ్నలను కించపర్చేలా ప్రదర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ఘటనలను భారతీయుడిగా తాను సహించలేకపోతున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మర్యాదగా ప్రవర్తించండి లేదా ప్రమాదంలో పడతారు
అమెజాన్ సంస్థ తీరుపై శక్తికాంత్ దాస్ తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ సంస్థపై నిప్పులు చెరిగారు. అమెజాన్ సంస్థ వరుస ఘటనలకు పాల్పడడాన్ని ఆయన తప్పు బట్టారు. మర్యాదగా ప్రవర్తిస్తే మంచిది, లేదంటే ప్రమాదం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అమెజాన్ అలక్ష్యంగా వ్యవహరిస్తోంది.
భారత దేశ గుర్తులు, ఐకాన్స్ పట్ల అమెజాన్ సంస్థ అలక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పారు. ఇది సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయుల మనోభావాల విషయంలో వివక్ష చూపితే ఆమెజాన్ తనంతట తానే ప్రమాదం కొనితెచ్చుకొన్నట్టుగా అవుతోందని హుందాగా వ్యవహరించాలని హెచ్చరించారు.

అమెరికాకు ఇండియా నిరసన
అమెజాన్ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపట్ల అమెరికాకు తన నిరసనను వ్యక్తం చేసింది ఇండియా.అమెరికాలోని భారత రాయబారి ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసినట్టు భారత విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ప్రకటించారు. భారతీయులు సెంటిమెంట్ ను మనోభావాలను గౌరవించాలని ఆయన కోరారు.ఈ పద్దతులు ఇలానే కొనసాగితే అమెజాన్ ప్రతినిధులకు వీసాలు కూడ ఇవ్వబోమని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై అమెజాన్ ఇండియా ప్రతినిధి క్షమాపణలు చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!