వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ వ్యూహం: రూ.500, రూ.1000 నోట్లపై రాత్రి ప్రకటన వెనుక షాకింగ్ కారణం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్ల రద్దు విషయమై మంగళవారం రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ప్రకటించారు. దీని వెనుక కారణం ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది. ఇందుకు ఎవరికి తోచిన విధంగా వారు కారణాలు వెతుక్కుంటున్నారు.

మోడీ ఇలా చేయడం వెనుక అనూహ్యమైన కారణం దాగి ఉందని అంటున్నారు. చివరి లావాదేవీలకు చెక్ చెప్పడమే మోడీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. బ్యాంకులు సాయంత్రం ఐదు గంటల దాకా పని చేశాయి. ఆ తర్వాత ఆయా బ్యాంకుల్లో ఎన్ని వెయ్యి నోట్లు, ఎన్ని 500 నోట్లు సహా ఎంత డబ్బు ఉందో రాత్రి ఎనిమిది గంటలకు ఆర్బీఐ ఖజానాకు తెలుపుతారు.

Behind Narendra Modi's announcement on Rs 500, Rs 1000 notes at night

ఈ సమాచారం అందరి నుంచి వచ్చాక ఎంత డబ్బు ఉందో ఆర్బీఐకి తెలుస్తుంది. ఇలా బ్యాంకుల నుంచి సమాచారం వచ్చాకే మోడీ ప్రకటన వెలువడిందని చెబుతున్నారు.

దీని వెనుక కూడా ఓ కారణం ఉందని చెబుతున్నారు. ఏదైనా ప్రకటన చేస్తే రాత్రికి రాత్రి కోట్లాది రూపాయలు చేతులు మారకుండా ఉండేందుకు ఇలా చేశారని అంటున్నారు. సమాచారం అంతా ఆర్బీఐకి వచ్చాక.. అవకతవకలు జరిగేందుకు కూడా వీల్లేకుండా ఇలా చేశారని అంటున్నారు.

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారని తెలిస్తే బ్లాక్ మనీ ఉన్నవాళ్లు తమకు తెలిసిన బ్యాంకు మేనేజర్లు, ఇతరుల ద్వారా తమ డబ్బును వైట్‌గా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రమాదాన్ని కూడా ముందే గుర్తించి, ఆయా బ్యాంకుల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాతనే ప్రకటన చేశారని అంటున్నారు. అదేవిధంగా బంగారం డబ్బులు మూతబడే సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రకటన చేశారంటున్నారు.

English summary
Behind Narendra Modi's announcement on Rs 500, Rs 1000 notes at night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X