• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాక

|

పాత పురాణాలు, అన్ని మత గ్రంథాల్లోనూ వారి ప్రస్తావనలు ఉన్నా.. తమకంటూ ఒక గుర్తింపు కోసం వేల ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది.. ఆడ-మగలు ముక్కున వేలేసుకునేలా చిన్న గుర్తింపు కోసం సుదీర్ఘ పోరాటాలు చేసిన చరిత్రవారిది.. వారి న్యాయపోరాటాలు ఫలించి కోర్టుల్లో అనుకూల తీర్పులు వచ్చాయి.. ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఎల్జీబీటీ కమ్యూనిటీ దూసుకుపోతున్నది.. అందాల పోటీల్లోనూ అదరగొడుతున్నది.. అంతర్జాతీయ వేదికలపై భారత్ కీర్తిపతాకలా నిలవబోతున్నది..

కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం -ముస్లిం, యూదు పెద్దల వ్యతిరేకత -మత గ్రంథాల్లో ఏముంది?కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం -ముస్లిం, యూదు పెద్దల వ్యతిరేకత -మత గ్రంథాల్లో ఏముంది?

మిస్ ట్రాన్స్ క్వీన్

మిస్ ట్రాన్స్ క్వీన్

దేశంలో ట్రాన్స్ జెండర్ల సాధికారత కోసం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం ‘మిస్ ట్రాన్స్ క్వీన్' పోటీలను నిర్వహిస్తుండటం తెలిసిందే. మిస్ ఇండియాకు సమానంగా భావించే ‘మిస్ ట్రాన్స్ క్వీన్‌ ఇండియా 2020' కిరీటాన్ని షైనీ సోని సొంతం చేసుకుంది. మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియా‌ పోటీలను తొలిసారిగా 2017లో నిర్వహించారు. సాధారణంగా అందాల పోటీల మాదిరిగానే ఇక్కడ కూడా ఫొటో షూట్స్, ట్యాలెంట్ రౌండ్స్, రకరకాలుదుస్తులు, పోటీలకు జడ్జ్‌లు.. ఉంటారు. వందలాది మంది ప్రేక్షకులు ఈ పోటీలను చూసేందుకు హాజరవుతారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పోటీలకు ఆటంకాలు ఏర్పడినా, చివరికి షోను నిర్వహించడం గమనార్హం.

భారత్ తరఫున సోని

భారత్ తరఫున సోని

ఫ్యాషన్ డిజైనర్ గా ఇప్పటికే తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న షైనీ సోని.. తాజాగా మిస్ ట్రాన్స్ క్వీన్ కిరీటంతో అంతర్జాతీయ ఖ్యాతి గణించింది. ప్రంపచంలో ట్రాన్స్‌జెండర్ మహిళల కోసం నిర్వహించే అతిపెద్ద పోటీ ‘మిస్ ఇంటర్నేషన్ క్వీన్'లో ఆమె పాల్గొనున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఆ పోటీల్లో సోని భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. సోనీకి అంతర్జాతీయ కిరీటం కూడా దక్కడం ఖాయమని ‘మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా' వ్యవస్థాపకురాలు రీనా రాయ్ అంటున్నారు.

 బాల్యంలో భయానక అనుభవాలు

బాల్యంలో భయానక అనుభవాలు

సోని మగ పిల్లవాడిగా జన్మించింది. అయితే శరీర భాగాలు మాత్రమే మగపిల్లాడిలా.. మెదడు-మనసు, ఆలోచనలు మాత్రం ఆడపిల్లలా ఉండేవి. బాల్యలో బడికి వెళ్లేటప్పుడు, ఆటలాడేప్పుడు తోటి పిల్లల నుంచి తీవ్రమైన వెక్కిరింపులు, వేధింపులు ఎదుర్కొనేది. ఆడ పిల్లలా ఉన్నావంటూ దోస్తులు ఆమెను అవమానించేవారు. టీనేజ్ లోకి ప్రవేశించిసరికి వేధింపులు ఇంకా తీవ్రతరం అయ్యాయి. అన్నీ తెలిసిన అమ్మానాన్నలు కూడా సోనినే తిడుతూ, బయటికి వెళ్లొద్దని గద్దించే వాళ్లు. భయానక అనుభవాలను దాటుకుంటూ 17వ ఏట అడుగుపెట్టాకగానీ సోని తన పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది..

హార్మోనల్ థెరపీతో హ్యాపీ..

హార్మోనల్ థెరపీతో హ్యాపీ..

తన 17వ ఏట సోని ఎల్జీబీటీ హక్కుల గురించి తెలుసుకుంది. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్ కమ్యూనిటీలతో కనెక్ట్ అయి, అదే ఏడాది ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. కమ్యూనిటీ సహకారంతో తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ విద్యను అభ్యసించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ క్రమంలోనే పురుషాంగాన్ని పూర్తిగా తొలగించుకుని స్త్రీత్వాన్ని సొంతం చేసుకుంది. కొన్నేళ్లకు హార్మోనల్ థెరపీ కూడా చేయించుకుని హ్యాపీ వుమన్ గా అవతరించింది. క్రియేటివ్ డిజైన్లతో ఫ్యాషన్ రంగాన్ని ఊపేస్తోన్న సోనిని ట్రాన్స్ క్వీన్ పోటీల్లో పాల్గొనాల్సిందిగా రీనా రాయ్ ఒప్పించారు. చివరికి సోనినే విజేతగా నిలవడం, అంతర్జాతీయ పోటీలకు ఆమె వెళ్లనుండటం చకచకా జరిగిపోయాయి. ‘‘ఈ పోటీ కేవలం అందం గురించి కాదు. ట్రాన్స్ జెండర్ల సాధికారత గురించి''అని సోని, రీనా తెలిపారు.

ఆవును మందలించాడని వ్యక్తి హత్య -నిందితుడు యాదవ్ పాల వ్యాపారి -మృతుడు గుప్తా దారుణస్థితిఆవును మందలించాడని వ్యక్తి హత్య -నిందితుడు యాదవ్ పాల వ్యాపారి -మృతుడు గుప్తా దారుణస్థితి

English summary
India has a new Miss Transqueen and she's headed for the world stage, determined to speak out for the country's marginalized transgender community. Fashion designer Shaine Soni was crowned Miss Transqueen India, the country's beauty pageant for transgender women, on Saturday. She will represent India at next year's Miss International Queen, the world's biggest pageant for transgender women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X