వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛీ: ప్రియుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై గ్యాంగ్ రేప్, వీడియో తీసి !

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని కాకతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి 17 ఏళ్ల బాలిక షికారుకు వెళ్లింది. అటవీ ప్రాంతంలో ఐదు మంది కామాంధులు ప్రియుడిని చెట్టుకు కట్టేసి బాలిక మీద సామూహిక అత్యాచారం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రియుడితో కలిసి జాలీగా షికారుకు వెళ్లిన బాలిక మీద కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా కాకతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 17 ఏళ్ల బాధితురాలు బెళగావి (బెల్గాం) జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని మంగళవారం డీసీపీ జి. రాధికా మీడియాకు చెప్పారు.

ఆలస్యంగా ఈ ఘటన వివరాలు వెలుగు చూశాయి. ఫిబ్రవరి 15వ తేదిన 17 ఏళ్ల బాలిక ప్రియుడితో కలిసి బైక్ లో కాకతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి షికారుకు వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరూ ఒక చోట కుర్చుని ఏకాంతంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఐదు మంది కామాంధులు అక్కడికి వెళ్లారు.

Belagavi Kakati police has been arrested 4 rapists in a minor gang rape case

ప్రియుడిని సమీపంలోని చెట్టుకు కట్టేసి బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి ఆమె నగ్నంగా ఉన్న సమయంలో వీడియో చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరించారు.

తరువాత ప్రేమికులు ఇద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. చివరికి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో నలుగురు కామాంధులను అరెస్టు చేసి ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని డీసీపీ రాధిక అన్నారు. బెళగావి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను డీసీపీ రాధికా పరామర్శించి వివరాలు సేకరించారు. పరారైన కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Belagavi Kakati police has been arrested 4 rapists in a minor gang rape case that happened on February 15. Police has filed compliant against rapists under the POCSO act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X