వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బళ్లారి గాలి బ్రదర్శ్ గూండాలతో బెదిరించారు. శ్రీరాములుకు ఏం తెలుసు: మాజీ సీఎం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: లోక్ సభ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. ఉప ఎన్నికల్లో విజయం సాంధించడానికి బీజేపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.

కొన్ని సంవత్సరాలుగా బళ్లారి ప్రజలు భయం, ఆందోళనలతో సతమతం అవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉంటరని సిద్దరామయ్య అన్నారు. లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్బంగా. తాను గతంలో బళ్లారికి వచ్చిన సమయంలో ఎదురైన సంఘటనలు సిద్దరామయ్య గుర్తు చేసుకున్నారు.

రెడ్డి బ్రదర్స్ గూండాలు

రెడ్డి బ్రదర్స్ గూండాలు

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానని సిద్దరామయ్య గుర్తు చేశారు. ఆ సందర్బంలో తాను బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్రగా వచ్చానని, ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులు గూండాలతో తమను బెదిరించారని సిద్దరామయ్య ఆరోపించారు.

సుప్రీంకోర్టుకు సీబీఐ వివాదం, నాగేశ్వరరావు నియామకం పైనా: జేపీ, లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?సుప్రీంకోర్టుకు సీబీఐ వివాదం, నాగేశ్వరరావు నియామకం పైనా: జేపీ, లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?

పోలీసులు పరుగు

పోలీసులు పరుగు

సండూలో తాను బహిరంగ సమావేశం నిర్వహించడానికి గాలి జనార్దన్ రెడ్డి సోదరులు అవకాశం ఇవ్వలేదని, కనీసం స్థలం కూడా ఇవ్వకుండా గూండాలతో బెదిరించారని, వారి దెబ్బకు పోలీసులు సైతం పరుగు తీసి చేతులు ఎత్తి వేశారని సిద్దరామయ్య ఆరోపించారు. సండూరు ప్రజలు ఇప్పటికీ భయంతో ఆందోళన చెందుతున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే ప్రజల సమస్యలు అన్నీ తీరిపోతాయని సిద్దరామయ్య అన్నారు.

శ్రీరాములుకు ఏం తెలుసు ?

శ్రీరాములుకు ఏం తెలుసు ?

బళ్లారి శ్రీరాములుకు 371 జే అంటే ఏం అర్థం తెలుసు అని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. అయితే నేరాలు ఎలా చెయ్యాలి, వాటి సెక్షలు ఏమిటీ ? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయంపై శ్రీరాములుకు పూర్తి అవగాహన ఉందని సిద్దరామయ్య ఆరోపించారు. ఇదే విషయంలో సిద్దరామయ్య సోషల్ మీడియాలో సైతం శ్రీరాములుపై విమర్శలు చేశారు.

జాతి రాజకీయాలు ?

జాతి రాజకీయాలు ?

శ్రీరాములును విమర్శిస్తే నాయక్ కులాన్ని విమర్శించినట్లే అని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారని, అయితే అదే శ్రీరాములు, బీజేపీ నాయకులు తనను విమర్శిస్తే కురబ జాతిని విమర్శించినట్లేనా ? అని సిద్దరామయ్య ప్రశ్నించారు. ఒక వ్యక్తిని విమర్శిస్తే వారి జాతిని విమర్శించినట్లు ఎలా అవుతుంది అని సిద్దరామయ్య బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

బళ్లారి సీటు మీద గురి

బళ్లారి సీటు మీద గురి


బళ్లారి లోక్ సభ ఉన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వీఎస్. ఉగ్రప్ప, బీజేపీ నుంచి బళ్లారి శ్రీరాములు సొంత సోదరి శాంతా ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే పోటీ మాత్రం వీరిద్దరి మద్య లేదు. కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్, బళ్లారి శ్రీరాములు మధ్య నువ్వానేనా అంటూ పోటీ ఏర్పడంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

English summary
Siddaramaiah recalled a incident while he was opposition leader. He said when i visited Bellary Janardhan Reddy and team let goons upon me. Bellary people were so afraid of them that no one ready to give place to do rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X