వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీదీ రాజ్యంలో బీజేపీ ఎంపీ నిరసన: రోడ్డు మీద కూర్చొని ఆందోళన, ఎందుకంటే...?

|
Google Oneindia TeluguNews

పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. కరోనా వైరస్ వచ్చిన ఆపత్కాలంలో కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బెంగాల్‌లో బీజేపీ నేతలకు స్థానిక ప్రభుత్వం, పోలీసుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. తాజాగా దక్షిణ దినాజ్‌పూర్ ఎంపీ సుకాంత మజుందార్‌కు కూడా తప్పలేదు. ఆయన నియోజకవర్గానికి వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతివ్వకపోవడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది.

కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో తన నియోజకవర్గానికి వెళ్లేందుకు మజుందార్ ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో అసహనానికి గురయ్యాడు. ఎందుకు తనను అడ్డుకున్నారో తెలియజేయాలని స్థానిక పోలీసుస్టేషన్‌కు లెటర్ కూడా రాశాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా అడ్డుకున్నారని పేర్కొన్నారు. దీదీ సర్కార్ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. ఓ ఎంపీ రోడ్డుపై కూర్చొని ఆందోళన చేయడం చర్చకు దారితీసింది.

Bengal BJP MP sits on road to protest against harassment by Trinamool govt..

Recommended Video

Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !

మరో బీజేపీ ఎంపీ జాన్ బార్లాను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. సామాజిక దూరం పాటించాలనే నిబంధలను ఎంపీ తుంగలో తొక్కారని హౌస్ అరెస్ట్ చేశారు. అంతలోనే మజుందార్‌కు కూడా అనుమతివ్వలేదు. బెంగాల్‌ ప్రభుత్వ తీరును నిరసిస్తూ... ఆదివారం బీజేపీ నేతలు ఆందోళనకు కూడా దిగారు. కానీ తనను తన నియోజకవర్గానికి వెళ్లనీయకపోవడం మాత్రం సరికాదని మజుందార్ అంటున్నారు.

English summary
West Bengal BJP MP Sukanta Majumdar has allegedly been stopped from entering his constituency in Dakshin Dinajpur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X