వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో సేమ్ సీన్: బీజేపీ చీఫ్‌ను అడ్డుకున్న పోలీసులు, పోలీసులతో వాగ్వివాదం..

|
Google Oneindia TeluguNews

నిన్న ప్రధాని మోడీతో కలిసి దీదీ మమతా బెనర్జీ ఏరియల్ సర్వే చేశారు. మోడీ అండగా ఉంటామని చెబితే.. దీదీ కూడా తల ఊపారు. 24 గంటల్లో గడిచిందో లేదో పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. అంఫాన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతం దక్షిణ 24 పరగణ జిల్లాకు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ శనివారం వెళ్లారు. కానీ అతనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీఎంసీ వర్సెస్ బీజేపీ వివాదం కంటిన్యూ అవుతోందని.. రాజీలేదు అని సంకేతాలు ఇచ్చారు.

Cyclone Amphan: బెంగాల్, ఒడిశాలో బీభత్సం, 84 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసంCyclone Amphan: బెంగాల్, ఒడిశాలో బీభత్సం, 84 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసం

జిల్లాలో ప్రభావిత ప్రాంతాల్లో సరుకులను అందజేసేందుకు దిలీప్ ఘోష్ వస్తున్నారు. దాలాల్ బ్రిడ్జి వద్ద దిలీప్ కారును పోలీసులు ఆపారు. తన కారును పోలీసులు ఎందుకు ఆపారో తెలియదన్నారు. అదే జిల్లాలో టీఎంసీ నేతలు పర్యటిస్తూ.. సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. కానీ పోలీసులు మాత్రం అధికార పార్టీ నేతలపై ఒకలా... తమపై మరొలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Bengal BJP president Dilip Ghosh stopped from visitig cyclone affected areas

సహాయ కార్యక్రమాలు చేసేందుకు అడ్డొస్తే.. టీఎంసీ కార్యకర్తలకు తమ ప్రతినిధులు బుద్దిచెబుతారని పేర్కొన్నారు. దిలీప్‌తో ఉన్న బీజేపీ నేత ఒకరు ఈ విషయంపై పోలీసు అధికారితో వాగ్వావాదానికి దిగారు. దిలీప్‌ను నెట్టివేయడంతో గొడవకు దిగామని వారు చెబుతుంటే.. పోలీసులు మాత్రం ఖండిస్తున్నారు. సహాయక చర్యలపై బీజేపీ రాజకీయాలు చేస్తుందని మంత్రి హకీం మండిపడ్డారు.

English summary
west bengal bjp president dilip ghosh was on saturdaay stopped by police from visiting the cyclone ravaged areas of the south 24 parganas disrict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X