• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీతో దీదీ భేటీ: బెంగాల్ పేరు మర్పు, కొవిడ్ టీకాలపై చర్చ -పెగాసస్ నిఘా కుట్రపై దర్యాప్తునకు డిమాండ్

|

హోరాహోరీగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి హస్తినలో అడుగుపెట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో దీదీ భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మోదీతో ఏం మాట్లాడింది, ఆయన ముందుంచిన అంశాలేంటో మమత మీడియాకు వివరించారు...

జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలుజగన్ బెయిల్ రద్దుకు సీబీఐ సిఫార్సు చేసింది: ఎంపీ రఘురామ క్లెయిమ్, సజ్జలపై తీవ్ర అవినీతి ఆరోపణలు

ప్రధని మోదీతో తనది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని మమతా బెనర్జీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో కరోనా పరిస్థితులను వివరించి, రాష్ట్రానికి మరిన్ని కోవిడ్ టీకాలు, మందులు పంపాలని కోరానన్నారు. అలాగే రాష్ట్ర పేరును బంగ్లాగా మార్చే అంశాన్ని కూడా లేవనెత్తానని, వీటన్నిటినీ పరిశీలిస్తామని మోదీ బదులిచ్చారని మమత పేర్కొన్నారు.

bengal cm Mamata meets PM Modi; discusses covid and demands Probe Into Pegasus

పార్ల‌మెంట్‌లో దుమారం రేపుతున్న పెగాస‌స్ వ్య‌వ‌హారంపై ప్ర‌ధాని మోదీ అఖిల ప‌క్ష భేటీ నిర్వ‌హించాలని టీఎంసీ చీఫ్ మమత డిమాండ్ చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆధ్వ‌ర్యంలో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌నీ దీదీ కోరారు. కేంద్రం తన ఫోన్లన్లు, సమావేశాలపై నిఘా ఉంచిందని, ప్రశాంత్ కిషోర్ తో జరిపిన మీటింగ్స్ పైనా నిఘా పెట్టారని, అందుకే మొబైల్ ఫోన్ కెమెరాకు ప్లాస్టర్ వేశానని, ఇక కేంద్రంలోని బీజేపీ మూతికి ప్లాస్టర్ వేయడమే మిగిలుందని మమత గతవారం ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక,

భార్యతోనే అలా: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు -సాయిరెడ్డికి తోడు దొంగభార్యతోనే అలా: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు -సాయిరెడ్డికి తోడు దొంగ

bengal cm Mamata meets PM Modi; discusses covid and demands Probe Into Pegasus

మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చిన మమత.. వివిధ రాజకీయ పక్షాలను కలవబోతున్నారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే కాంగ్రెస్ నేత క‌మ‌ల్‌నాథ్‌ను ఆమె క‌లిశారు. బుధవారం సాయంత్రం సోనియాతోనూ దీదీ భేటీ కానున్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా మమతను పెడతారనే వార్తల నడుమ ఆమె ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది.

English summary
Mamata Banerjee met with Prime Minister Narendra Modi at his residence in Delhi today. After the meeting, she told reporters that there should be a Supreme Court-monitored inquiry into the Pegasus scandal. mamata also discusses Covid, demands more vaccines for west Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X