• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెంగాల్ లో కాంగ్రెస్, సీపీఎం కలిసే పోటీ ? త్వరలో ఏచూరీ, రాహుల్ భేటీ

|

కోల్ కతా : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ .. పొత్తుల ఎత్తుల్లో మునిగిపోయాయి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని దెబ్బతీసేందుకు యూపీఏ పక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, సీట్ల కేటాయింపులోనూ రాజీపడి ఎన్నికలకు సై అంటున్నాయి.

రాష్ట్రాలవారీగా పొత్తులు

రాష్ట్రాలవారీగా పొత్తులు

కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు తదితర పార్టీలు ఆయా రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుంటున్నాయి. అక్కడ ఉన్న లోక్ సభ సీట్లలో తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు జరిపి .. ఎన్నికలకు ముందుగానే బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు బీజేపీతో అన్నాడీఎంకే, కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు ఖరారైంది. ఇక పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ బరిలోకి దిగుతుండగా .. కాంగ్రెస్, సీపీఎం కలిసి పోటీచేస్తామనే సంకేతాలు ఇచ్చాయి.

ఒక్కటిగా బరిలోకి ..

ఒక్కటిగా బరిలోకి ..

సాధారణంగా ఇతర పార్టీలతో పొత్తులంటే రాష్ట్రంలోని నేతలు వద్దని చెబుతారు. కానీ బెంగాల్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో సీపీఎంతో కలిసి పోటీ చేసేందుకు .. ఓకే అని ... చర్చలు కొనసాగించాలని అధినేత రాహుల్ కు స్పష్టంచేశారు. దీంతో రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టొచ్చని .. అదేవిధంగా 2021లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగొచ్చని భావిస్తున్నారు.

రాహుల్ తో ఏచూరి భేటీ ?

రాహుల్ తో ఏచూరి భేటీ ?

బెంగాల్ కాంగ్రెస్ కార్యాలయం బిందన్ భవన్ లో ఆ పార్టీ రాష్ట్ర అధినేత సోమెన్ మిత్రా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీట్ల పొత్తుపై రాహుల్ గాంధీ తీసుకున్న చొరవ ప్రశంసనీయమన్నారు. ప్రస్తుతం బెంగాల్ లో కాంగ్రెస్, సీపీఎం 6 లోక్ సభ నియోజకవర్గా్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ స్థానాల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. దీనిప సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమావేశమై నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఈ వారం వీరి భేటీ ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఉగ్రవాదుల మృతిపై బీజేపీలో భిన్న వాదనలు

రెండు చోట్ల సీపీఎం, 4 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

రెండు చోట్ల సీపీఎం, 4 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

కాంగ్రెస్, సీపీఎం పోటీ చేసే స్థానాలపై కూడా స్పష్టత వచ్చింది. రాయ్ గంజ్ ముర్షిదాబాద్ నుంచి సీపీఎం, ఉత్తర మల్దా, దక్షిణ మాల్దా, బెహరాంపూర్, జంగిపూర్ స్థానాల్లో కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తోందని బెంగాల్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bengal unit of the Congress has asked party president Rahul Gandhi to consider the “need” to share seats with the CPM for general election so that the BJP’s progress can be checked in the state and Trinamul Congress can be ousted from power in the 2021 Assembly polls. Sources at Bengal Congress headquarters Bidhan Bhavan here said state party chief Somen Mitra had written to Rahul to impress upon him the need to enter into an electoral understanding with the Left Front. The letter was sent in the wake of the CPM central committee on Monday approving an understanding with the Congress not to fight each other in the six seats the two parties currently hold in Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more