వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో డాక్టర్ల సమ్మె ఉద్ధృతం.. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వైద్య సేవలు..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : బెంగాల్‌లో ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై రోగి బంధువుల దాడి ఘటనపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మెకు దిగారు. ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల సంఘం పిలుపు మేరకు వైద్యులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఢిల్లీ సహా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా పలు నగరాల్లో విధులు బహిష్కరించిన డాక్టర్లు ఆందోళనల్లో పాలు పంచుకుంటున్నారు.

ప్రేమ వైఫల్యం...తుపాకులతో కాల్చుకుని ఆత్మహత్య...ప్రేమ వైఫల్యం...తుపాకులతో కాల్చుకుని ఆత్మహత్య...

నిరసన తెలుపుతున్న డాక్టర్లు

నిరసన తెలుపుతున్న డాక్టర్లు

ఢిల్లీలో పలువురు రెసిడెంట్ డాక్టర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. రోగుల బంధువుల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎయిమ్స్ వైద్యులు హెల్మెట్లు, బ్యాండేజీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఓపీ సేవలను బంద్ చేసిన డాక్టర్లు ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం కొనసాగిస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు బెంగాల్‌లో జూనియర్ డాక్టర్‌పై దాడికి నిరసనగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని నిర్ణయించారు.

నిమ్స్‌లో డాక్టర్ల ఆందోళన

నిమ్స్‌లో డాక్టర్ల ఆందోళన

జూనియర్ డాక్టర్‌పై దాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లోనూ వైద్యులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. నిమ్స్ హాస్పిటల్‌లో డాక్టర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. అటు మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓపీ, వార్డుల్లో వైద్య సేవలు అందించరాదని నిర్ణయించారు. అయితే ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రం ఎలాంటి ఆటంకంలేకుండా చర్యలు తీసుకున్నారు.

బెంగాల్‌లో నాల్గో రోజుకు చేరిన సమ్మె

బెంగాల్‌లో నాల్గో రోజుకు చేరిన సమ్మె

ఇదిలా ఉంటే బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె నాల్గో రోజుకు చేరింది. సమ్మె విరమించాలని సీఎం మమతబెనర్జీ అల్టిమేటం ఇచ్చినా వారు బేఖాతరు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. మమత బెనర్జీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే సమ్మె విరమిస్తామని జూడాలు స్పష్టం చేశారు.

రాజకీయ కుట్ర అంటున్న దీదీ

రాజకీయ కుట్ర అంటున్న దీదీ


కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న రోగి సోమవారం చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యమే అందుకు కారణమని మృతుని బంధువు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్లపై దాడి చేశారు.ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. అయితే దీని వెనుక బీజేపీ, సీపీఎంల హస్తం ఉందని దీదీ ఆరోపిస్తుండగా... ఓట్ల కోసం మమత బెనర్జీ సమ్మె విషయంలో రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.

English summary
Doctors across country have decided to boycott work for a day to express solidarity with their protesting colleagues in West Bengal. Doctors at Delhi's All India Institute of Medical Sciences were seen wearing helmets and bandages as they attended to patients. Doctors of hyderabad stage protest at NIMS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X