వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీ కీలక నిర్ణయం- ఇక వారానికి రెండు రోజులు లాక్ డౌన్...

|
Google Oneindia TeluguNews

పశ్చిమబెంగాల్లో కరోనా వ్యాప్తి విస్తృతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణ వ్యాప్తి దాటి సామాజిక వ్యాప్తి కూడా జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కేసుల సంఖ్య 50 వేలకు చేరువైంది. వెయ్యికి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఆరు నగరాల నుంచి కోల్ కతాకు విమాన సేవలు కూడా నిలిచిపోయాయి.

Recommended Video

COVID 19 In India: భారత్‌లో ఒక్కరోజే 39 వేల కేసులు, వ్యాక్సిన్ వచ్చేలోపే కబళించేలా కరోనా వైరస్ !

దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాల జిల్లాలతో పాటు పూర్వ, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో ఇక్కడ ప్రత్యేక కోవిడ్ అస్పత్రులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

bengal govt orders two day complete lockdown every week to curb covid 19

అదే సమయంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇకపై వారంలో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని మమత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వారం జూలై 23, 25 తేదీల్లో సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో అన్ని మార్కెట్లు, ప్రజా జీవనం నిలిపి వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కోవిడ్ సేవలను విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. ఇప్పటివరకూ కేంద్రం సూచనల మేరకు అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుండగా... దేశంలో తొలిసారి లాక్ డౌన్ పునరుద్ధరించిన రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది.

English summary
To curb the covid 19 spread in the state, west bengal govt has announced complete lockdown across the state for two days every week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X