వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు మరో లెజెండ్ బలి -సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు -ప్రమాదమని తెలిసినా సినిమాపై ప్రేమతో షూటింగ్‌ చేసి..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి మరో ఐకానిక్ లెజెండ్ ను బలితీసుకుంది. ప్రముఖ బెంగాలీ నడుటు, దాదాసాహెబ్ ఫాల్కీ అవార్డు గ్రహిత సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు. సినిమా షూటింగ్ సమయంలో కొవిడ్-19 వ్యాధికి గురై, కొంతకాలంగా చికిత్స పొందుతోన్న ఆయన.. ఆదివారం మధ్యాహ్నం కోల్ కతాలో కన్నుమూశారు. చనిపోయేనాటికి సౌమిత్ర వయసు 85 ఏళ్లు. దాదాపు నెల రోజులకుపైగా వైరస్ తో పోరాడిన ఆయన చివరికి ప్రాణలు కోల్పోయారు.

చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్‌లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్‌లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?

ఆస్పత్రి అధికారిక ప్రకటన..

ఆస్పత్రి అధికారిక ప్రకటన..

‘‘సౌమిత్ర ఛటర్జీ చనిపోయారన్న వార్తను చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. ఆదివారం 12:15 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కొవిడ్-19 వ్యాధితో అక్టోబర్ 6న ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందాలతో శ్రమించాం. కానీ చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడంతో కాపాడుకోలేకపోయాం. ఆ మహా నటుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం'' అని బెల్లెవ్ నర్సింగ్ హోం అధికారిక ప్రకటన చేసింది.

లాక్ డౌన్ వెంటనే షూటింగ్ చేసి..

లాక్ డౌన్ వెంటనే షూటింగ్ చేసి..

వయసు పైబడిన తర్వాత కూడా సినిమాలపై మక్కువతో సౌమిత్ర ఛటర్జీ పనిని కొనసాగించారు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ లో సినిమాల షూటింగ్స్ కు అనుమతివ్వడంతో ఛటర్జీ ఎంతో ఉత్సాహంగా తానే దర్శకత్వం వహిస్తున్న ‘అభియాన్' షూటింగ్ ను పూర్తి చేశారు. అయితే ఆ సమయంలోనే ఆయనకు వైరస్ సోకింది. అప్పటికే న్యుమోనియా నుంచి కోలుకున్న ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం బాగా క్షీణించింది. అక్టోరబ్ 6న ఆస్పత్రిలోచేరిన ఆయన పరిస్థితి విషమించడంతో గత వారం ఐసీయూకు తరలించారు. ఆదివారం నాటికి ఆయన మన నుంచి వెళ్లిపోయారు.

పాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ ‘స్క్రిప్ట్' -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝాపాపం నితీశ్ కుమార్ -సీఎం పదవికి బీజేపీ ‘స్క్రిప్ట్' -సంచలనాలు చూడబోతున్నాం: మనోజ్ ఝా

Recommended Video

Ravi Teja Praises Cult Classic 'Color Photo' Movie || Oneindia Telugu
బెంగాలీల ఆరాధ్య నటుడు..

బెంగాలీల ఆరాధ్య నటుడు..

బెంగాలి తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్ర ఛటర్జీ తూర్పు రాష్ట్రాల వారికి ఆరాధ్య నటుడు అయ్యారు. ఉత్తమ నటుడిగా ఒక జాతీయ పురస్కారం, రెండు సార్లు స్పెషల్ జ్యూరీ విభాగంలో జాతీయ అవార్డులు అందుకున్నారు. బెంగాలీ చిత్ర సీమకు ఈయన చేసిన సేవలకు గాను కేంద్రం ఛటర్జీని 2004లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సినీ రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2012లో ఆయనకు దక్కింది. సౌమిత్ర ఛటర్జీ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

English summary
Ending an era in Indian films, veteran actor and Dadasaheb Phalke Award recipient Soumitra Chatterjee passed away on Sunday at at the Belle Vue Clinic in kolkata. He was 85. He battled the deadly coronavirus for days at a private hospital here and turned negative, but finally succumbed to his ailments after almost 40 days' fight. He was on ventilation for the past few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X